నాణ్యతకు తిలోదకాలు

26 May, 2017 01:45 IST|Sakshi
- శంషాబాద్‌ విమానాశ్రయంలో కలుషిత పదార్థాల విక్రయాలు
- అధిక ధరలున్నా తనిఖీలు శూన్యం
 
శంషాబాద్‌ (రాజేంద్రనగర్‌): రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కొన్నిహోటళ్లు, బేకరీల్లో ఆహారపదార్థాల నాణ్యతపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస ప్రమాణాలను సైతం పాటించకుండా ఆహార పదార్థాలు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కని పించడం లేదు. దీంతో దుకాణదాల యజమానులు తాము ఆడిందే ఆటగా, ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తున్నారు. విమానాశ్రయంలోని అరై వల్‌తో పాటు ప్రయాణికులు కిందికి దిగి వచ్చే పార్కింగ్‌ ఏరియా సమీపంలో భారీ ఎత్తున దుకాణాలను ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో వీటి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.  ప్రయాణికుల ఆత్రుతను సొమ్ము చేసుకుంటున్న దుకాణదారులు నాసిరకమైన వాటిని కూడా వారికి అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.
 
ఇదిగో ఇలా..
అంతర్జాతీయ విమానాశ్రయంలో కనీస ప్రమా ణాలను పాటించకుండా కొన్ని బేకరీల యజమానులు బయట తయారు చేయించిన ఆహార పదార్థాలను విక్రయిస్తారు. నీళ్ల బాటిళ్లు, శీతల పానీయాల బాటిళ్లు, ఆహారం భద్రపరిచే బాక్సులు పాడై కలుషితంగా మారుతున్నాయి. వీటిని కొనుగోలు చేసి తింటున్న కొనుగోలుదారులు అవి బాగా లేవని చెప్పినా.. అలాగే ఉంటాయని దుకాణదారులు దురుసుగా వ్యవహరిస్తున్నారు. 
 
పర్యవేక్షణ పూజ్యం
విమానాశ్రయంలోని హోటళ్లు,  బేకరీలపై  పర్య వేక్షణ  లేదు. ఇక్కడ ఆహార పదార్థాలను తనిఖీలు చేయడం లేదు. ఆహార పదార్థాల నాణ్య తను పరీక్షించిన దాఖలాలు లేవు. ఇటీవల జీహెచ్‌ఎంసీలో ఆహార పదార్థాలను పరీక్షించిన విధంగా ఎయిర్‌పోర్టులో ఉన్న హోటళ్లు, రెసా ్టరెంట్టు, బేకరీల్లో కూడా తనిఖీలు చేపట్టాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎంఆర్‌ పీల కన్నా చాలా ఎక్కువ ధరలకు విక్రయిస్తు న్నారని.. వాటిని కూడా నియంత్రించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.
మరిన్ని వార్తలు