కళ్లు తిరిగాయని వెళితే.. చేయి తీసేశారు

22 Jan, 2017 02:52 IST|Sakshi
కళ్లు తిరిగాయని వెళితే.. చేయి తీసేశారు

వైష్ణవి.. ఈ ఫొటోలో ఉన్నమ్మాయే..చక్కగా ఉంది కదూ..అయితే.. ఇదంతా నెల క్రితం వరకూ..మరిప్పుడు..ఒక చేయి లేదు.. రెండో చేయి పనిచేయడం లేదు.. కాళ్లు కూడా..

స్వల్ప అనారోగ్యంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన యువతి

  • రక్తం ఎక్కించడంతో వాచిపోయిన బాధితురాలి చేయి
  • ఇన్ఫెక్షన్‌ సోకిందంటూ కుడి చేయి తొలగింపు
  • పని చేయకుండా పోయిన ఎడమ చేయి.. కాళ్లు
  • హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన బాధితురాలి తల్లిదండ్రులు

సాక్షి, హైదరాబాద్‌: చిన్న సమస్యతో ఆస్పత్రికి వెళ్తే.. చివరికది చేయి తీసేదాకా వెళ్లింది. ఆస్పత్రుల నిర్లక్ష్యం.. తమ బంగారుకొండ జీవి తాన్ని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేసిందంటూ వైష్ణవి తల్లిదండ్రులు శనివారం మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు రూ.24 లక్షల బిల్లు అయిం దని, ఆ మొత్తం చెల్లిస్తేనే తదుపరి వైద్య సేవలు కొనసాగిస్తామని ఆస్పత్రులు స్పష్టం చేయడంతో దిక్కుతోచని స్థితిలో తాము ఇక్కడికి వచ్చామని చెప్పారు. వారేం చెప్పారంటే..

కళ్లు తిరిగి పడిపోయి ఆస్పత్రికి వెళ్తే..
మౌలాలి హనుమాన్‌నగర్‌కు చెందిన రాంశెట్టి సుధాకర్‌ కుమార్తె వైష్ణవి(17) ఈ నెల 3వ తేదీన అకస్మాత్తుగా కళ్లుతిరిగి పడిపోయింది. దీంతో తల్లి దండ్రులు చికిత్స కోసం ఆమెను నాచారం లోని ప్రసాద్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్‌ సుమప్రసాద్‌ బాధితురాలు రక్తహీనతతో బాధ పడుతోందని, ఆమెకు రక్తం ఎక్కిం చాల్సి ఉందని చెప్పి అడ్మిట్‌ చేశారు. వారే ‘జనని వలంటరీ బ్లడ్‌ బ్యాంక్‌’ నుంచి రక్తం తెప్పించారు. అయితే రక్తం ఎక్కిస్తున్న సమయంలో వైష్ణవి చేయి నల్లగా కమిలి పోయి శరీరమంతా భరించలేని మంటతో ఇబ్బంది పడింది. ఇన్‌ఫెక్షన్‌ సోకిందని, మెరుగైన వైద్యం అందించాలని సదరు వైద్యురాలు 4వ తేదీన జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు.

నిర్లక్ష్య చికిత్స వల్లే: వైష్ణవి తండ్రి సుధాకర్‌
వైష్ణవిని అడ్మిట్‌ చేసుకున్న అపోలో వైద్యులు తల్లిదండ్రులను పిలిచి పరిస్థితి విషమించిందని, కుడి చేయిని వెంటనే తొలగించాలని, లేదంటే ప్రాణాలకే ప్రమాదమని స్పష్టం చేశారు. తమకు ఆలోచించే అవకాశం కూడా ఇవ్వకుండా బలవంతంగా తమతో సంతకం చేయించుకుని తమ కుమార్తె కుడి చేయిని తొలగించారని సుధాకర్‌ ఆరోపించారు. ఉన్న ఇల్లు అమ్మి వైద్య ఖర్చులు చెల్లించానని, మరో రూ.20 లక్షలు చెల్లించాలని, లేదంటే చికిత్స నిలిపి వేస్తామని ఆస్పత్రి వైద్యులు బెదిరిస్తున్నారని అన్నారు. ఈ మేరకు హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. 15 రోజులుగా వైద్యుల నిర్లక్ష్య చికిత్స వల్లే తన కూతురు ప్రాణాపాయ స్థితికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాద్‌ హాస్పిటల్, అపోలో హాస్పిటల్‌ వైద్యులపై చర్యలు తీసుకోవా లని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు వైద్యుల నిర్లక్ష్యంపై సుధాకర్‌ నాచారం పోలీసులకూ ఫిర్యాదు చేశాడు. అంతేకాక తమ కుమార్తెకు ఈ గతి పట్టించిన సదరు కార్పొరేట్‌ వైద్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో కూడా ఫిర్యాదు చేశారు.

ప్రాణాలకు ప్రమాదమనే తొలగించాం: అపోలో వివరణ
వైష్ణవి ఎనీమియాతో బాధపడు తోందని, అప్పటికే ఆమెకు 3 నర్సింగ్‌ హోమ్స్‌లో చూపించారని, ఆయా ఆస్ప త్రుల్లో రక్తం కూడా ఎక్కించారని, ఏ బ్లడ్‌ బాటిల్‌ ద్వారా ఇన్‌ఫెక్షన్‌ సోకిందో తెలియ దని అపోలో ఆస్పత్రి వివరణ ఇచ్చింది. ఆమెను తమ వద్దకు తీసుకొచ్చే సమయా నికి తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌తో బాధపడు తోందని, ఇన్‌ఫెక్షన్‌ సోకిన భాగాన్ని తొలగించకపోతే అది విస్తరించి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేదని పేర్కొంది. ఇదే అంశాన్ని యువతి తల్లిదండ్రులకు వివ రించామని, వారు చికిత్సకు అంగీకరించిన తర్వాతే ఇన్‌ఫెక్షన్‌ సోకిన భాగాన్ని తొలగించి.. మానవతా దృక్పథంతో చికిత్స అందిస్తున్నామని తెలిపింది. బిల్లు చెల్లిం చాల్సిందిగా ఒత్తిడి చేసినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, రూ.19 లక్షల బిల్లు అయితే.. వారు ఇప్పటి వరకు రూ.4 లక్షలే చెల్లించారని వెల్లడించింది.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు