మొదటి ఆదివారం అదే పరిస్థితి

12 Dec, 2016 14:56 IST|Sakshi
మొదటి ఆదివారం అదే పరిస్థితి

హైదరాబాద్‌: పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో తలెత్తిన కరెన్సీ కష్టాలు కొనసాగుతున్నాయి. జీతం డబ్బులు ఖాతాల్లో జమ అయినా.. వాటిని తీసుకోలేని పరిస్థితి ఉద్యోగులది. దీంతో డిసెంబర్‌ నెల మొదటి ఆదివారం కూడా సామాన్య ప్రజలు ఎలాంటి ఖర్చులకు వెళ్లకుండా ఉండటం కనిపిస్తోంది. మార్కెట్‌లో చికెన్, మటన్‌ షాపులు వెలవెలబోతున్నాయి. మరోవైపు డబ్బుకోసం ఏటీఎంలకు వెళ్తున్న ప్రజలను అక్కడి నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. ఎక్కడో ఒకచోట మాత్రమే డబ్బులున్న ఏటీఎంలు కనిపిస్తున్నా.. అక్కడ భారీ క్యూ లైన్లలోనే సెలవుదిన సమయం గడిచిపోతుంది.

క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 80 శాతం ఏటీఎంలను కొత్త నోట్లకు అనుగుణంగా మార్చామని అధికారులు చెబుతున్నా.. ఆ పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.

మరిన్ని వార్తలు