వ్యభిచారంలోకి దించితే కఠిన చర్యలు

5 Mar, 2017 00:45 IST|Sakshi
వ్యభిచారంలోకి దించితే కఠిన చర్యలు

డీజీపీ అనురాగ్‌శర్మ హెచ్చరిక

సాక్షి, హైదరాబాద్‌: మహిళలు, మైనర్‌ బాలికలను వ్యభి చార కూపంలోకి దింపే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ అనురాగ్‌శర్మ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్, కర్నూతోపాటు మెదక్‌ జిల్లాలో వ్యభిచార కేంద్రాలపై సీఐడీ దాడులు చేసి పెద్ద సంఖ్యలో బాధితులను రక్షించిందన్నారు. శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ‘మానవ అక్రమ రవాణా’ అంశంపై జరిగిన సదస్సుకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాధితుల పట్ల మానవత్వంతో వ్యవహరించి వారు కోలుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలతో కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.

విద్య వల్ల మానవ అక్రమ రవాణా అరికట్టొచ్చని యునిసెఫ్‌ స్టేట్‌హెడ్‌ జేరూ మాస్టర్‌ అభిప్రాయపడ్డారు. మానవ అక్రమ రవాణాలో దేశంలో రాష్ట్రం 4వ స్థానంలో ఉండటం ఆందోళనకరమని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్‌ అన్నారు. కార్యక్రమంలో కార్మిక ఉపాధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, రిటైర్డ్‌ ఐపీఎస్‌ నాయర్, సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు