తప్పుచేయలేదు.. చర్య తీసుకోడానికి వీల్లేదు

22 Dec, 2016 13:04 IST|Sakshi
తప్పుచేయలేదు.. చర్య తీసుకోడానికి వీల్లేదు
తాను ఏ తప్పూ చేయలేదని, తనపై చర్య తీసుకోడానికి వీల్లేదని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని) అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజి కమిటీ సమావేశానికి ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హాజరయ్యారు. 
 
తమకు ఉద్దేశపూర్వకంగానే నోటీసులు ఇచ్చారని, వీడియో ఫుటేజిలో ఎక్కడా తాను అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు లేదని నాని చెప్పారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన వారిపై ప్రభుత్వం కక్షగట్టిందని అన్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నాని చెప్పారు. 
మరిన్ని వార్తలు