దిల్‌సుఖ్‌నగర్ కేసులో నూ అబిదీన్

2 May, 2016 02:03 IST|Sakshi
దిల్‌సుఖ్‌నగర్ కేసులో నూ అబిదీన్

ఐఎం ఎక్స్‌ప్లోజివ్ మాడ్యుల్‌లో కీలక పాత్రధారి
నాటి జంట పేలుళ్లకు పేలుడు పదార్థం సరఫరా
సౌదీ అరేబియా నుంచి డిపోర్టేషన్‌పై ముంబయికి..
పీటీ వారెంట్‌పై తెచ్చేందుకు ఎన్‌ఐఏ సన్నాహాలు

 
సాక్షి, సిటీబ్యూరో: దిల్‌సుఖ్‌నగర్‌లో 2013, ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్ళ కేసులో మరో కీలక నిందితుడు జైనుల్ అబిదీన్ ఎట్టకేలకు చిక్కాడు. నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఎక్స్‌ప్లోజివ్స్ మాడ్యుల్ చీఫ్ ఇస్మాయిల్ అఫాఖీకి ఇతడు ప్రధాన అనుచరుడు. గత ఏడాది అఫాఖీ అరెస్టు నేపథ్యంలోనే ఇతడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో కేంద్ర నిఘా వర్గాలు ఇంటర్‌పోల్ ద్వారా రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేయించాయి. దీని ఆధారంగా సౌదీ అరేబియా ఏజెన్సీలు గత అక్టోబర్‌లో అదుపులోకి తీసుకున్నాయి. చట్టపరమైన అంశాలు పూర్తయిన తర్వాత మంగళవారం డిపోర్టేషన్‌పై ముంబైకి పంపించాయి.


అఫాఖీ ద్వారా రియాజ్‌తో సంబంధాలు...
హైదరాబాద్‌ను మరోసారి టార్గెట్ చేయాలని 2012లో కుట్రపన్నిన ఐఎం మాస్టర్‌మైండ్ రియాజ్ భ త్కల్ కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న భత్కల్ ప్రాంతానికి చెందిన, బెంగళూరులో హోమియోపతి డాక్టర్‌గా చెలామణి అయిన సయ్యద్ ఇస్మాయిల్ అఫాఖీ అలియాస్ డాక్టర్ సాబ్‌తో సంప్రదింపులు జరిపాడు. రియాజ్ స్వస్థలం కూడా భత్కల్ కావడంతో వీరి పరిచయం పెరిగింది. 2013 ఫిబ్రవరి మొదటి వారంలో చాటింగ్ ద్వారా అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీని (దిల్‌సుక్‌నగర్ బ్లాస్ట్స్ నిందితుడు) సంప్రదించిన రియాజ్ హైదరాబాద్‌లో విధ్వంసాలకు పాల్పడాలనే విషయం చెప్పి, దీనికి అవసరమైన పే లుడు పదార్థాలు అందించే బాధ్యతల్ని బెంగళూరులో ఉంటున్న సయ్యద్‌ఇస్మాయిల్ అఫాఖీకి అప్పగించాడు.

అమ్మోనియం’ సేకరించిన అఫాఖీ గ్యాంగ్...
ఐఎం మాడ్యుల్‌కు సంబంధించి తొలి అరెస్టులు 2008లో జరిగాయి. ఈ పరిణామంతో దేశం దాటేసిన రియాజ్ భత్కల్ పాకిస్థాన్‌లో తలదాచుకున్నాడు. ఇక్కడ ఉన్నన్నాళ్లూ పేలుడు పద్దార్థాలను తానే స్వయంగా సమీకరించి విధ్వంసాలు సృష్టించాడు. పాక్‌కు పారిపోయిన తర్వాత ఆ బాధ్యతల్ని అఫాఖీకి అప్పగించాడు. దీంతో 2009 నుంచి జరిగిన పేలుళ్లకు అవసరమైనా ఎక్స్‌ప్లోజివ్ (అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ) అఫాఖీనే తన గ్యాంగ్ ద్వారా సమీకరిం సరఫరా చేడయం ప్రారంభించాడు.    అలా ఈ ‘డాక్టర్ సాబ్’ ఐఎం ఎక్స్‌ప్లోజివ్ మాడ్యుల్ చీఫ్‌గా మారాడు.


రోటీన్‌కు భిన్నంగా సమీకరణ...
ఎక్స్‌ప్లోజివ్స్ సమీకరణలో నిఘా, పోలీసులు అనుమానం రాకుండా అఫాఖీ అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. కర్ణాటకలోని ఉడిపి, రత్నగిరి తీరప్రాంతాలకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు వినియోగించే ‘మీన్ తూటా’ల నుంచే పేలుడు పదార్థం సేకరణ అనువైన మార్గమని ఎంచుకున్నాడు. ఎక్స్‌ప్లోజివ్‌ను జాగ్రత్తలతో సముద్రంలో పడిపేల్చడం ద్వారా చేపలు పట్టే విధానాన్ని అక్కడి మత్స్యకారులు ‘మీన్ తూ టా’ అంటారు. ఉత్తర కన్నడ, మంగుళూరుల్లోని ఎక్స్‌ప్లోజివ్స్ డీలర్లు అక్రమంగా మత్స్యకారులకు ఈ స్లర్రీని అమ్మేస్తుంటారు. ఈ విధానాలు అధ్యయనం చేసిన అఫాఖీ పేలుడు పదార్థం సమీకరణకు ఇదే మార్గాన్ని ఎంచుకున్నాడు.


సద్దాం, అబిదీన్‌ల ద్వారానే ‘స్మగ్లింగ్’...
మీన్ తూటా’ల పేరుతో పేలుడు పదార్థం సేకరించే బాధ్యతల్ని అఫాకీ భత్కల్‌కే చెందిన స్క్రాప్ వ్యాపారి సద్దాం హుస్సేన్‌తో పాటు జైనుల్ అబిదీన్‌లకు అప్పగించాడు. స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్ళాలని చెప్తూ ఉడిపి, రత్నగిరిల నుంచి మీన్ తూటాలు తెప్పించేవాడు. వాటిని పేలుళ్ళు జరిపే ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదులకు పంపడం లేదా వారినే మంగుళూరు, బెంగళూరు రప్పించి అప్పగించడం చేసేవాడు. ఈ అమ్మోనియం నైట్రేట్ స్లర్రీని వినియోగించి తయారు చేసిన బాంబుల్నే ఉగ్రవాదులు హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ సహా అనేక చోట్ల పేల్చారు. 2013 హైదరాబాద్ పేలుడు తరవాత సౌదీ అరేబియా వెళ్ళిపోయిన అబిదీన్ అక్కడ ఓ దుకాణంలో నెలకు 1200 రియాల్స్ వేతనానికి సేల్స్‌మెన్‌గా ఉద్యోగంలో చేరాడు. ఐఎం ఎక్స్‌ప్లోజివ్స్ మాడ్యుల్ చీఫ్‌గా ఉన్న అఫాఖీతో పాటు సద్దాం తదితరుల్ని బెంగళూరు పోలీసులు గత ఏడాది జనవరిలో అరెస్టు చేశారు. అఫాఖీ విచారణలోనే తమ ముఠాలో అబిదీన్ కూడా ఉన్నాడని బయటపడింది.


గతేడాది సౌదీలో అదుపులోకి...
అబిదీన్ సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడని అఫాఖీ ద్వారా తెలుసుకున్న నిఘా వర్గాలు అతడి పాస్‌పోర్ట్ నెంబర్ ఆధారంగా ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాయి. దీంతో అబిదీన్‌పై రెడ్‌కార్నర్ నోటీసు జారీ అయింది.   సౌదీ ఏజెన్సీలు గతేడాది అక్టోబర్‌లో అబిదీన్‌ను అదుపులోకి తీసుకున్నాయి. డిపోర్టేషన్‌కు   చట్టపర అంశా లు పూర్తయ్యాక మంగళవారం ముంబై కి పంపాయి. 2011 జూలైలో అక్కడి దాదర్, జవేరీ బజార్, ఓప్రా హౌస్ వద్ద జరిగిన పేలుళ్లలో వాంటెడ్ కావడంతో ఈ కేసులో ఏటీఎస్ అధికారులు అరెస్టు చేశారు. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులోనూ వాంటెడ్‌గా ఉన్న అబిదీన్‌ను పీటీ వారెంట్‌పై తీసుకురావడానికి  జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సన్నాహాలు చేస్తోంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గవర్నర్‌ను కలిసిన సీఈవో ద్వివేది

క్యారీ బ్యాగ్‌కు రూ.5 వసూలు.. షాపింగ్‌ మాల్‌కు జరిమానా

పెళ్లి రోజే అనంత లోకాలకు

‘టీపీసీసీ చీఫ్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదం’

మాజీ ఎమ్మెల్యే శారారాణి కన్నుమూత

పరిషత్‌ తొలి భేటీకి నిబంధనలు సవరించాలి

రాష్ట్రంలో ప్రత్యామ్నాయం మేమే

అన్ని జిల్లాల్లో ‘అవతరణ’ వేడుకలు

జనగామ నుంచే మొదటి యాత్ర

మూడు గెలిచినా జోష్‌ లేదు!

జూన్‌ రెండోవారంలోగా ‘పరిషత్‌’ కౌంటింగ్‌!

ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు

జగన్‌ విజయం ప్రజా విజయం 

‘వైఎస్‌ జగన్‌.. కామ్‌ గోయింగ్‌ స్టూడెంట్‌’ 

వైఎస్‌ జగన్‌ ప్రమాణ ముహూర్తం ఖరారు

కలసి సాగుదాం

27న పోలీసు పరీక్షల తుది ‘కీ’ 

సివిల్‌ వివాదాల్లో మీ జోక్యం ఏమిటి?

‘మింట్‌ కాంపౌండ్‌’ దాతృత్వం

రేపు ఇంటర్‌ రీవెరిఫికేషన్‌ ఫలితాలు అప్‌లోడ్‌ 

ఈ–పాస్, ఐరిస్‌తో రూ. 917 కోట్లు ఆదా

కొత్త గురుకులాల్లో కాంట్రాక్టు ఉద్యోగులే!

వడదెబ్బ; కాప్రా టీపీఎస్‌ మృతి

లివ్ అండ్ లెట్ లివ్ మా విధానం : కేసీఆర్‌

లోటస్‌ పాండ్‌ వద్ద సందడి వాతావరణం

గురువారం మే 30.. మధ్యాహ్నం 12.23..

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి: జగన్

హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం

వైఎస్ జగన్‌ ఢిల్లీ పర్యటన షెడ్యూల్‌..

పవన్‌ కళ్యాణ్‌పై జాలేసింది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మోదీకి శుభాకాంక్షలు తెలపలేదు..!

నేనూ  అదే కోరుకుంటున్నా!

ఫ్యూజ్‌పోయిన పవర్‌స్టార్‌

హాలీవుడ్‌ మళ్లీ పిలిచింది

పెళ్లి వద్దు... పిల్లలు కావాలి

లెక్కలు చెప్పేదాన్ని!