బ్యాంకుతో లింకు లేకుండా రాయితీ రుణాలు

6 Jan, 2018 02:26 IST|Sakshi

ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌  

సాక్షి, హైదరాబాద్‌: బ్యాంకర్ల సహకారం లేకపోవడంతో ఫైనాన్స్‌ కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే రాయితీ రుణ లక్ష్యాల పురోగతి అంతంతమాత్రంగానే ఉండేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ అభిప్రాయపడ్డారు. ఇకపై బ్యాంకర్ల గొడవ లేకుండా లబ్ధిదారులకు రుణాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోందన్నారు. శుక్రవారం బీసీ నివేదికపై కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశమైంది. బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్వయం ఉపాధి, ఆర్థిక చేకూర్పు పథకాలపై చర్చించారు.

2018–19 సంవత్సరం సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రంగా మారుతుందని ఈ సందర్భంగా ఈటల అన్నారు.  గొల్ల, కురుమలు, మత్స్యకారుల ఉపాధికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. బీసీల సంక్షేమం కోసం కమిటీ పలుమార్లు చర్చించిందని, అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించిందన్నారు. నివేదిక తుది దశకు వచ్చిందని, మరోమారు సమీక్షించి ïసీఎంకు సమర్పిస్తామన్నారు.

మరిన్ని వార్తలు