మహారాష్ట్రలో ‘ద్రవ్య’ బిల్లుపై డివిజన్

31 Mar, 2016 01:32 IST|Sakshi
మహారాష్ట్రలో ‘ద్రవ్య’ బిల్లుపై డివిజన్

2014 ఏప్రిల్ 16న మహారాష్ట్ర అసెంబ్లీలో ఓటింగ్
 
 సాక్షి, హైదరాబాద్: ద్రవ్య వినిమయ బిల్లును కేవలం మూజువాణి ఓటుతోనే సరిపెట్టాలని, డివిజన్ (అనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను స్పష్టంగా నిర్ధారించడానికి వీలుగా సభలో నిర్వహించే ఓటింగ్ ప్రక్రియ)కు అవకాశం లేదంటూ ఏపీ శాసనసభలో బుధవారం అధికార పక్షం చేసిన వాదనలో వాస్తవం లేదని తేలిపోయింది. ఈ బిల్లుపై డివిజన్‌కు అవకాశం కల్పిం చడం.. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర శాసనసభలో నూ జరగలేదని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పిన దాంట్లోనూ నిజం లేదని తేలింది.

2014 ఏప్రిల్ 15న మహారాష్ట్ర శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుకు సభ మూజువాణి ఓటు తో ఆమోదం తెలిపిన తర్వాత.. అప్పటి ప్రతిపక్షం (బీజేపీ, శివసేన) డివిజన్ కోరింది. అప్పటి స్పీకర్ దిలీప్ వాల్సే పాటిల్.. ప్రతిపక్షం డిమాండ్ కు సానుకూలంగా స్పందించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై డివిజన్‌కు అంగీకరించారు. బిల్లుకు అనుకూలంగా 105, వ్యతిరేకంగా 72 ఓట్లు వచ్చాయి. బిల్లుకు ఆమో దం లభించిందని స్పీకర్ ప్రకటించారు.

మరిన్ని వార్తలు