రూ.కోటి మేర ఐపీ పెట్టిన వైద్యుడు

5 Sep, 2015 19:20 IST|Sakshi
రూ.కోటి మేర ఐపీ పెట్టిన వైద్యుడు

నేరేడ్‌మెట్ (హైదరాబాద్): ఆస్పత్రి అభివృద్ధి కోసమని దాదాపు రూ.కోటి అప్పుగా తీసుకుని, ఆపై ఐపీ నోటీసులు పంపాడు ఓ వైద్యుడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరం నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు..  డాక్టర్ విజయ్ (40) కొన్నేళ్లుగా నేరేడ్‌మెట్ ప్రాంతంలో దంత వైద్యశాలను నిర్వహిస్తున్నాడు. మంచిగా సేవలందిస్తూ పేరు తెచ్చుకున్నాడు. అయితే, కొంతకాలంగా ఆస్పత్రి అభివృద్ధి కోసమంటూ తెలిసిన సుమారు 15 మంది వద్ద నుంచి రూ.కోటి వరకు అప్పుగా తీసుకున్నాడు.

ఇవి కాకుండా బ్యాంక్‌లు, ఫైనాన్స్ సంస్థల నుంచి రూ.80 లక్షల వరకు ఆయనకు అప్పు ఉంది. బ్యాంకులు, అప్పులు ఇచ్చిన వారికి కొంతకాలంపాటు వడ్డీ సక్రమంగా చెల్లించాడు. ఆ తర్వాత ఆస్పత్రిని మూసి వేసి విదేశాలకు వెళ్లిపోయినట్లు తెలిసింది. కొందరు రుణ దాతలకు ఆయన ఇచ్చిన చెక్కులు చెల్లలేదు. దీంతో బాధితులు నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా వారం క్రితం డబ్బులు ఇచ్చిన వారికి విజయ్ దివాలా తీసినట్లు (ఐపీ) నోటీసులు పంపాడు. దీంతో బాధితులంతా లబోదిబో మంటున్నారు.

మరిన్ని వార్తలు