జీవాలకు సేవ చేయడం అదృష్టం: తలసాని

4 Jan, 2018 03:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీవాలకు సేవ చేయడం ఎంతో అదృష్టమని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. జీవాలకు అవసరమైన వైద్యం సకాలంలో అందించడంతో పాటు గ్రాసం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో పశుసంవర్థక శాఖ అధికారుల నూతన డైరీ, క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పశుసంవర్థక శాఖలో నూతన నియామకాలు చేపట్టడంతో పాటు, పదోన్నతులు ఇచ్చామని తెలిపారు.

రానున్న రోజుల్లో శాఖ మరింత అభివృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పశు వైద్య సేవలను మెరుగుపర్చడంతో పాటు ఆస్పత్రులలో మౌలిక వసతులు కల్పించామన్నారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనతో చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఇటీవల బదిలీ అయిన పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా శాఖ అభివృద్ధికి ఎంతో కృషిచేశారని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు, అదనపు కార్యదర్శి రేణుకాదేవి, టీఎస్‌ఎల్‌డీఏ సీఈవో మంజువాణి, పశుసంవర్థక శాఖ అధికారుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ బేరీ బాబు, వీఏఎస్‌ల అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ పెంటయ్య, డాక్టర్‌ కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మర్కజ్‌ దెబ్బ!

డీజీపీ మహేందర్‌రెడ్డికి అరుదైన గౌరవం

ప్రాణాలకంటే ఆటలు ఎక్కువ కాదు

పరీక్షలు పెంచడమే మార్గం  

లాక్‌డౌన్‌ వేళ.. ఆన్‌లైన్‌ అర్చన

సినిమా

రూ.1.25 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన అజిత్‌

టిక్‌టాక్ వీడియోపై ర‌ష్మి ఆగ్ర‌హం

క‌రోనా : న‌టి టిక్‌టాక్ వీడియో వైర‌ల్‌

నటుడి కుటుంబానికి కరోనా.. ధైర్యం కోసం పోస్టు!

మాస్క్‌లు వ‌దిలేసి, చున్నీ క‌ట్టుకోండి: విజ‌య్

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నిఖిల్‌..