రాయితీపై డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

20 Mar, 2016 12:12 IST|Sakshi
రాయితీపై డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలోని వార్షికాదాయం రూ. 6 లక్షలలోపు ఉన్న ప్రభుత్వ.. ప్రైవేటు ఉద్యోగులకు శుభవార్త. వీరికి రాయితీపై ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సహకారం అందించాల్సిందిగా శుక్రవారం ఢిల్లీ వెళ్లిన మంత్రి కేటీ రామారావు, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కోరారు. దీనికి ఆయన సానుకూల సంకేతాలిచ్చినట్లు మేయర్ రామ్మోహన్ తెలిపారు. ఆయన జీహెచ్‌ఎంసీలో విలేకరుల తో మాట్లాడుతూ... సంవత్సరాదాయం రూ. 6 లక్షల లోపు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఇతరుల  కోసం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కు గృహ నిర్మాణ పథకం కింద నిధులివ్వాల్సిందిగా కోరామన్నారు. నగరంలో నిర్మిస్తు న్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయాలన్నింటితో కలిపి దాదాపు రూ.9 లక్ష లు ఖర్చవుతోంది. వార్షికాదా యం రూ.6 లక్షలలో పు ఉన్న  దిగువ మధ్య తరగతి వారికి ఒక్కో ఇంటికి కేం ద్రం రూ.2.50 లక్ష లు ఇస్తే.. జీహెచ్‌ఎం సీ రూ.2 లక్షలు సా యం చేస్తుందని చెప్పారు. లబ్ధిదారుల వాటాగా రూ. 2 లక్షలు చెల్లిస్తే.. మిగతా వ్యయాన్ని బ్యాంకు రు ణాల ద్వారా అందించే యోచన ఉందన్నారు. దీనికి విధి విధానాలు రూపొందించాల్సి ఉందన్నారు.

లబ్ధిదారులకు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లు
నగరంలో నిర్మాణం పూర్తయి... ఖాళీగా ఉన్న జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామని మేయర్ చెప్పారు. ఈ ఇళ్లలో అక్రమంగా ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తామని చెప్పారు. మరుగుదొడ్లు లేనివారు వాటిని నిర్మించుకునేందుకు యూనిట్‌కు రూ.12 వేల వంతున ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. స్మార్ట్‌సిటీ ద్వారా అందే రూ.100 కోట్లు నగరానికి చాలవని... వేరే పథకం ద్వారా పెద్దమొత్తంలో నిధులివ్వాల్సిందిగా మంత్రి కేటీఆర్ కోరారన్నారు. నిర్మాణం పూర్తయిన స్లాటర్ హౌస్‌లను వందరోజుల ప్రణాళికలో భాగంగా వినియోగంలోకి తెస్తామన్నారు. వాటిపై ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటామని... స్లాటర్ హౌస్‌లకు సంబంధించి ఢిల్లీలో జరిగిన సదస్సులోనూ ఈ అంశం ప్రస్తావనకొచ్చింద ని ఆయన తెలిపారు.

త్వరలో వ్యర్థాల రీ సైక్లింగ్...
ఢిల్లీ తరహాలో నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా వివిధ పరిమాణాల్లో కంకర, ఇసుక, మట్టి తదితరమైనవి వెలువడే యూనిట్‌ను హైదరాబాద్‌లో త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. నాలుగైదు ప్రాంతాల్లో ఇలాంటివి ఏర్పాటుకు యోచిస్తున్నామని చెప్పారు. దీనికి త్వరలోనే టెండర్లను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. ఘన వ్యర్థాల(చెత్త) నిర్వహణ కేంద్రాలను కూడా వీలైనన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు.
 

మరిన్ని వార్తలు