ఓటరు స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోండిలా..!

13 Jan, 2016 03:16 IST|Sakshi
ఓటరు స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోండిలా..!

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అటు ఎన్నికల సంఘం, ఇటు జీహెచ్‌ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. నగర ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా నిరాసక్తత కనబరిచే కారణాల్లో వారి పోలింగ్ కేంద్రం ఎక్కడుందో తెలియకపోవడం ఒకటని భావించి వెబ్‌సైట్‌నుంచి, మొబైల్ యాప్ ద్వారా కూడా ఓటరు స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ (http://tsec.gov.in)లోకి వెళ్లాలి.

 అందులో..
♦ ‘డౌన్‌లోడ్ ఓటర్ స్లిప్’ పై క్లిక్ చేయాలి.
♦ డౌన్‌లోడ్ జీహెచ్‌ఎంసీ ఓటరుస్లిప్ అని వస్తుంది.
♦ సర్కిల్, వార్డు, డోర్‌నెంబరు, పేరు, ఎపిక్ నెంబరు (ఓటరు గుర్తింపుకార్డు నెంబరు) ఎంటర్ చేయగానే ఓటరు వివరాలతో కూడిన స్లిప్‌వస్తుంది. దాన్ని సేవ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు.
♦ ఎపిక్ కార్డులేని పక్షంలో సర్కిల్, వార్డులను ఆయా కాలమ్‌లలో భర్తీ చేశాక డోర్‌నెంబరు, పేరు వివరాల్లో ఏ ఆప్షన్‌ను పేర్కొన్నా సరిపోతుంది. ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు తెలిస్తే ఇంకా మంచిది.
♦ ఓటరు జాబితాలో కచ్చితంగా ఏపేరు ఉందో తెలిస్తే సదరు ఆప్షన్‌పై టిక్ చేసినా  ఓటర్లు స్లిప్ వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవాలి. లేని పక్షంలో పేరులోని తొలి అక్షరాలు కొన్ని చేసినా సదరు అక్షరాలతో ప్రారంభమయ్యే ఓటర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిల్లో కావాల్సిన వారి పేరు, వివరాలు చూసుకోవాలి.
 ఎవరి ఓటరు స్లిప్ కావాలో ఆపేరు వరుసలో ఉన్న ‘ప్రింట్ ఓటరు స్లిప్’పై క్లిక్ చేస్తే ఎపిక్ నెంబరు వివరాలతో కూడిన స్లిప్ వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు.
♦ స్మార్‌‌ట ఫోన్ ఉన్నవారు గూగుల్ ప్లేస్టోర్‌నుంచి టీఎస్ ఎలక్షన్ కమిషనర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, అందులో ఎపిక్ నెంబరును ఎంట్రీ చేస్తే వివరాలొస్తాయి.
♦ నగర ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు