‘హీరో’కు నాలా పన్ను మినహాయింపు

16 Jun, 2016 19:42 IST|Sakshi

ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ ప్రైవేటు లిమిటెడ్‌పై ప్రభుత్వం రాయితీల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఆ పరిశ్రమకు కేటాయించిన భూమికి నాలా పన్ను నుంచి మినహాయంపును ఇస్తూ గురువారం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

 

చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మాదన్నపాలెంలో ద్విచక్ర వాహనాల పరిశ్రమ ఏర్పాటుకు హీరో మోటో కార్ప్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు 632.96 ఎకరాల భూమిని కేటాయించిన విషయం విదితమే. అక్కడ పరిశ్రమను ఏర్పాటుచేయాలంటే.. ఆ భూమిని వ్యవసాయ విభాగం నుంచి వ్యవసాయేతర విభాగం కిందకు మార్పిడి చేయాలి. ఇందుకు నాలా రూపంలో ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. ఆ పన్ను నుంచి ‘హీరో’ సంస్థకు ప్రభుత్వం మినహాయింపును ఇచ్చింది.

 

మరిన్ని వార్తలు