'డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే వీసా రద్దు'

13 May, 2016 16:16 IST|Sakshi

హైదరాబాద్ : విదేశాలకు వెళ్లాలనుకునేవారు ఇకపై హైదరాబాద్‌లో జాగ్రత్తగా వాహనం నడపాల్సి ఉంటుంది. లేకుంటే వారి వీసా రద్దు, దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడినవారి వివరాలను పోలీసులు పకడ్బందీగా సేకరించి ఉంచుకుంటారు. సదరు వ్యక్తి వీసాను రద్దు చేయటం లేదా వారి దరఖాస్తును తిరస్కరించేందుకు అవకాశాలున్నాయి.

అంతేకాదు.. వారు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నా రిజక్ట్ చేసే ప్రమాదముంది. త్వరలోనే ఈ మేరకు నిబంధనలు అమలు చేయాలంటూ ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు ఆయన తెలిపారు. 2011 నుంచి ఇప్పటివరకు నమోదైన 62 వేల డ్రంకెన్‌ డ్రైవ్ కేసుల్లో 18-30 ఏళ్ల వారు 30 వేలకు మందికి పైగా ఉన్నారని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు