కరువుపై చర్చకు అసెంబ్లీని సమావేశపర్చాలి

17 May, 2016 02:30 IST|Sakshi

 సీఎంకు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ప్రభుత్వపరంగా చేపట్టే సహాయ చర్యలపై చర్చిం చేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. కరువుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని, నీటి ఎద్దడి, పశుగ్రాసం కొర త నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. కేంద్రం నుంచి కరువు సహాయం కింద రూ.10వేల గ్రాంట్ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు. పంట నష్టపోయి న రైతులకు తక్షణ సహాయగా ఎకరాకు రూ.10వేల కోట్ల చొప్పున పరిహారం చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ద్వారా ఉల్లి క్వింటాల్ రూ.1500 చొప్పున, మార్క్‌ఫెడ్ ద్వారా పసుపు క్వింటాల్‌కు రూ.12వేలు చొప్పున, చెరకు టన్నుకు రూ.1,000 చొప్పున ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలని కోరారు.

మరిన్ని వార్తలు