ఏ మాత్రం డౌట్‌ రాకుండా..

8 Apr, 2017 06:33 IST|Sakshi
ఏ మాత్రం డౌట్‌ రాకుండా..

జీన్స్‌ ప్యాంట్స్‌లో మాంద్రాక్స్‌ మాత్రలు
- కువైట్‌కు కొరియర్‌ ద్వారా పంపించే ప్రయత్నం
- ఎయిర్‌కార్గోలో గుర్తించిన డీఆర్‌ఐ అధికారులు


సాక్షి, హైదరాబాద్‌: నిషేధిత మాదకద్రవ్యమైన మాంద్రాక్స్‌ (మెథక్యులోన్‌)ను మాత్రల రూపంలో కువైట్‌కు పంపేందుకు చేసిన ప్రయత్నాన్ని డీఆర్‌ఐ అధికారులు అడ్డుకున్నారు. శుక్రవారం శంషాబాద్‌ విమానాశ్రయం ఎయిర్‌కార్గోలో తనిఖీలు చేసిన బృందాలు రూ.9.2 లక్షల విలువైన 2,300 మాంద్రాక్స్‌ మాత్రలను స్వాధీనం చేసుకున్నాయి. జీన్స్‌ ప్యాంట్లకు నడుము భాగంలో ఉండే పట్టీలో ఈ మాత్రల్ని నేర్పుగా పార్శిల్‌ చేసిన స్మగ్లర్లు కొరియర్‌ ద్వారా పంపే ప్రయత్నం చేశారు.

దీన్ని పంపిన వ్యక్తి చిరునామా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలోని కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన మహ్మద్‌ రఫీ.. మాంద్రాక్స్‌ మాత్రల్ని ఆరు జీన్స్‌ ప్యాంట్లలో పార్శిల్‌ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న డీఆర్‌ఐ అధికారులు ఎయిర్‌కార్గోలో తనిఖీ చేశారు. ప్రతి మాత్ర పైనా ‘225’అనే కోడ్‌ నంబర్‌ రాసి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పార్శిల్‌ను పంపింది రఫీనేనా? లేక ఎవరైనా బోగస్‌ చిరుమానా వినియోగించారా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.

మరిన్ని వార్తలు