ఔటర్‌పై మొదటిసారిగా డ్రంకెన్ డ్రైవ్..

18 Dec, 2015 23:42 IST|Sakshi
ఔటర్‌పై మొదటిసారిగా డ్రంకెన్ డ్రైవ్..

హయత్‌నగర్: ఇన్నాళ్లూ నగరంలోపలే నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లను మొదటిసారి ఓటర్ రింగ్ రోడ్డుపైనా నిర్వహించారు ట్రాఫిక్ పోలీసులు. వనస్థలిపురం ట్రాఫిక్ సీఐ నరేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఔటర్‌రింగురోడ్డుపై డ్రంకన్ డ్రై వ్ చేపట్టారు. ఇందులో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 11 మంది డ్రై వర్‌లు పట్టుబడ్డారు. కాగా మినీ ట్రావెల్స్ బస్సు డ్రై వర్ మద్యం సేవించి నడుపుతుండగా ఇందులో 30 మంది బ్రహ్మకుమారీలు ప్రయాణిస్తున్నారు.

అంతేగాక ఓ కారులో ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళ మద్యం సేవిస్తూనే వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కారు. వీరి కారులో నుంచి పోలీసులు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఔటర్‌రింగురోడ్డుపై గస్తీ నిర్వహించే ఓఆర్‌ఆర్ పెట్రోలింగ్ వాహనం డ్రై వర్ సైతం మద్యం సేవించి వాహనం నపుడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోవడం గమనార్హం. ఈ మేరకు పోలీసులు డ్రంకన్ డ్రై వ్‌లో పట్టుబడిన 6 కార్లు, ఒక లారీ, డీసీఎం, కోళ్ళ వ్యాన్, ఒక మినీ ట్రావెల్స్ బస్సు, ఓఆర్‌ఆర్ పెట్రోలింగ్ వాహనాలను సీజ్ చేసి డ్రై వర్లపై కేసులు నమోదు చేశారు. ఈ డ్రంకన్ డ్రై వ్‌లో ఎస్‌ఐ కష్ణయ్య, ఆర్‌ఎస్‌ఐ ఇమకర్, ఏఎస్‌ఐ ముత్యంరెడ్డి, 15 మంది సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు