తాగి డ్రైవింగ్ చేస్తే లెసైన్స్ రద్దు

9 Jul, 2013 04:35 IST|Sakshi
 రంగారెడ్డి జిల్లా కోర్టులు:  ఇకపై మద్యం తాగి వాహనాలు నడిపేవారి లెసైన్స్‌లను రద్దు చేయనున్నట్టు సైబరాబాద్ 2వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దుర్గాప్రసాద్ ప్రకటించారు. సైబరాబా ద్ 2వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్, ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా సోమవారం న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో అవగాహన సదస్సును నిర్వహించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కలిగే అనర్థాలపై ప్రొజెక్టర్ ద్వా రా ప్రదర్శించి అవగాహన కలిగించారు. 
 
ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. తాగి వాహనం నడిపేవారికి కఠిన శిక్షలు విధిస్తామన్నారు. కాగా, గత శుక్ర, శని, ఆదివారాల్లో ఉప్పల్, ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీ సులు నిర్వహించిన ‘డ్రంకన్‌డ్రైవ్’ ప్రత్యేక తనిఖీల్లో 47 మంది పట్టుబడ్డారు. వీరి తల్లిదండ్రులు, భార్యలను ఈ సదస్సుకు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. 47 మంది వాహనదారులకూ రూ.2 వేల జరిమానా విధించారు. వీరిలో అతిగా మద్యం తాగి వాహనాలు నడిపిన 12 మందికి ఆరు రోజుల జైలుశిక్ష విధించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ నతానియల్, ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జ్ఞానేందర్‌రెడ్డి, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సుభాష్‌చంద్రబోస్ పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు