రాజ్యసభకు డీఎస్, కెప్టెన్ ఏకగ్రీవం

4 Jun, 2016 03:05 IST|Sakshi
శుక్రవారం రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనట్లు డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావులకు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్న రిటర్నింగ్ అధికారి రాజా

ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాలు అందజేసిన రిటర్నింగ్ అధికారి
 
 సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీ చేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్), కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉప సంహరణ గడువు శుక్రవారంతో ముగిసింది. రెండు స్థానాలకు రెండే నామినేషన్లు దాఖలు కావడంతో వారిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా రిటర్నింగ్ అధికారి, శాసనసభ కార్యదర్శి రాజా సదారాం ప్రకటించారు.

ఈ మేరకు డీఎస్, కెప్టెన్‌లకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ ఇద్దరితో రాజ్యసభలో టీఆర్‌ఎస్ బలం ముగ్గురు ఎంపీలకు చేరింది. ఇప్పటికే కె.కేశవరావు (కేకే) టీఆర్‌ఎస్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు