‘డీఎస్సీ’ బాధితులకు న్యాయం చేసేదెప్పుడు?

30 Sep, 2016 02:26 IST|Sakshi

* సీఎం చెప్పినా పడని అడుగులు
* ఉద్యోగాల కోసం 6,900 మంది నిరీక్షణ

సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో 1998 నుంచి 2012 వరకు నిర్వహించిన డీఎస్సీల్లో నష్టపోయిన నిరుద్యోగులకు న్యాయం చేయడంలో అడుగు ముందుకు పడటం లేదు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చి ఏడాదిన్నర దాటినా.. శాఖల పరిశీలన పేరుతో కాలయాపన జరుగుతోంది. గతేడాది జనవరిలో  కేసీఆర్ వరంగల్‌లో పర్యటించిన సమయంలో 1998 డీఎస్సీలో నష్టపోయిన నిరుద్యోగులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారికి ఉద్యోగాలు ఇస్తామని సీఎం ప్రకటించారు.

ఆ తరువాత జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో 1998 డీఎస్సీలో నష్టపోయిన వారితో పాటు 2012 వరకు నిర్వహించి 5 డీఎస్సీల్లో నష్టపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారికి కూడా పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించారు.  అది ఇంతవరకు ఆచరణ కు నోచుకోలేదు. దీంతో ఉద్యోగాల కోసం 6,900 మంది  విద్యా శాఖ చుట్టూ తిరుగుతున్నారు.
 
సుప్రీంకోర్టు వరకూ....
1998లో చేపట్టిన 40 వేల టీచర్ పోస్టుల భర్తీలో అనేక అక్రమాలు జరిగాయి. దీనిపై వరంగల్, కరీంనగర్, ఖమ్మ ం, నల్గొండ జిల్లాలకు చెందిన అభ్యర్థులు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. సుప్రీంకోర్టు కూడా వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలని స్పష్టం చేసినా ఆచరణకు నోచుకోవడం లేదు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘హాష్‌ట్యాగ్‌లు’ సృష్టించి వైరల్‌

గ్రహం అనుగ్రహం (05-04-2020)

ఇదీ కరోనా సేఫ్టీ టన్నెల్‌

ఆ రెండూ దొరకట్లేదు..

గబ్బిలాలతో వైరస్‌.. నిజమేనా?

సినిమా

కోడలికి కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్‌

ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారిన రష్మికా..

లాక్‌డౌన్‌లో నటి జాలీ రైడ్‌, గాయాలు

రాక్షసిలాగా అనిపించింది ఆ జైలు!

కొడుకుతో ఆడుకుంటున్న హీరో నానీ 

జైలు కాదు.... మనందరి మేలు