అగ్రస్థానాలు కోల్పోయిన తెలంగాణ, ఏపీ

5 Aug, 2016 02:22 IST|Sakshi

సులభ వాణిజ్యం ర్యాంకుల్లో మూడు, నాలుగో స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు
 సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రాలకు సులభ వాణిజ్యం (ఈవోడీబీ)లో కేంద్ర పారిశ్రామిక విధానం, ప్రోత్సాహకాల విభాగం (డిప్) ఇచ్చే తాత్కాలిక ర్యాంకుల్లో తెలంగాణ, ఏపీకి మూడు, నాలుగో స్థానాలకు తగ్గాయి. తాత్కాలిక ర్యాంకుల్లో కొంతకాలంగా తెలంగాణ మొదటి స్థానంలో, ఏపీ రెండో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈవోడీబీపై ప్రపంచ బ్యాంకు రూపొందించిన 340 ప్రశ్నలకు సంబంధించి రాష్ట్రాలు డిప్‌కు తమ సమాధానాలు సమర్పించాయి. ఆ సమాధానాల్లో సవరణలకు ఆగస్టు 16వ తేదీ వరకు గడువు పొడిగించారు. తాజాగా గురువారం ప్రకటించిన తాత్కాలిక ర్యాంకుల్లో తెలంగాణ 61.45 స్కోరుతో మూడో స్థానంలో, ఏపీ 56.05 స్కోరుతో నాలుగో స్థానంలో నిలిచాయి. 63.72 స్కోరుతో ఉత్తరాఖండ్ తొలిస్థానంలో, 62.94 స్కోరుతో రాజస్థాన్ రెండో స్థానంలో ఉన్నాయి. సెప్టెంబర్ నెలాఖరుకు కసరత్తు పూర్తి చేసి తుది ర్యాంకులు ప్రకటించేందుకు డిప్ సన్నాహాలు చేస్తోంది. అప్పటి వరకు తాత్కాలిక ర్యాంకుల్లో తరచూ మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు