ముగిసిన విద్యుత్‌ బంధం!

12 Jun, 2017 01:11 IST|Sakshi
ముగిసిన విద్యుత్‌ బంధం!
ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్‌ పంపకాలు బంద్‌  
 
సాక్షి, హైదరాబాద్‌: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్‌ బంధం పూర్తిగా తెగిపోయింది. విద్యుత్‌ వాటాల పంపకాల ప్రకారం తెలంగాణకు సరఫరా చేయాల్సిన విద్యుత్‌ను ఏపీ శనివారమే నిలిపివేయగా, ఆదివారం తెల్లవారుజాము నుంచి తెలంగాణ సైతం ఏపీ వాటా సరఫరాను నిలుపుదల చేసింది. విద్యుత్‌ పంపకాలకు సంబంధించిన రూ. 3,139 కోట్ల బకాయిలు చెల్లిం చలేదని తెలంగాణకు ఏపీ విద్యుత్‌ సంస్థలు విద్యుత్‌ సరఫరాను నిలిపివేయగా, ఏపీ నుంచే రూ. 1,676.46 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని పేర్కొంటూ తెలంగాణ సైతం ఏపీకి విద్యుత్‌ వాటాల పంపకాలను నిలిపివేసింది.

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోని జెన్‌కో విద్యుత్‌ ప్లాంట్ల నుంచి తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం  విద్యుత్‌ వాటాలున్నాయి. మూడేళ్ల పాటు రెండు రాష్ట్రాలు థర్మల్‌ విద్యుత్‌లో వాటాలు పంచుకోగా, తాజాగా ఈ పంపకాలకు బ్రేక్‌ పడినట్లు అయింది.
మరిన్ని వార్తలు