పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

29 Mar, 2015 03:15 IST|Sakshi

బంజారాహిల్స్: పర్యావరణ పరిరక్షణను అందరూ బాధ్యతగా తీసుకోవాలని కేంద్ర అటవీశాఖ ప్రకాష్ జవదేకర్ అన్నారు. శనివారం బంజారాహిల్స్‌లోని కేబీఆర్ నేషనల్ పార్కును సందర్శించిన ఆయన పార్కులో వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా వాకర్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. దేశంలో ప్లాస్లిక్‌క్యారీ బ్యాగుల సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి త్వరలో కేంద్ర ్రపభుత్వం దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా క్యారీ బ్యాగ్‌లపై నిషేధాన్ని కఠిన ంగా అమలు చేయడంతో పాటు తక్కువ మైక్రాన్ల క్యారీ బ్యాగ్‌ల తయారీ సంస్థలను గుర్తించి మూసివేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో పట్టణాల్లో పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.
 
ఈ సందర్భంగా పార్కులో ప్రవేశ రుసుం తగ్గించాల్సిందిగా వాకర్లు కోరగా చట్టప్రకారం పార్కు నిర్వహణ ఉంటుందన్నారు. పార్కులో సీసీ కెమెరాల ఏర్పాటు,   వాకర్ల భద్రతకు తీసుకుంటున్న చర్యలను పార్కు నిర్వహణాధికారి మోహన్ వివరించారు. కార్యక్రమంలో అధికారులు మిశ్రా, శర్మ,  శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు