ఈపీఎఫ్‌ లేకుంటే అనర్హులే!

31 May, 2017 02:53 IST|Sakshi
ఈపీఎఫ్‌ లేకుంటే అనర్హులే!
- విద్యుత్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నిబంధనలు
మార్గదర్శకాలను ఆమోదించిన విద్యుత్‌ సంస్థల బోర్డులు
ఈపీఎఫ్‌ నిబంధనతో అన్యాయం జరుగుతుందంటున్న కార్మిక సంఘాలు  
 
సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ శాఖ ఔట్‌సోర్సిం గ్‌ కార్మికులకు ఈపీఎఫ్‌ లేకుంటే క్రమబద్ధీకరణకు అనర్హులు కానున్నారు. అంతేగాకుండా జీవిత భాగస్వామి ఆంధ్రప్రదేశ్‌ లేదా ఇతర ప్రాంతాలకు చెందినవారైతే కూడా క్రమబద్ధీకరణ అవకాశం కోల్పోనున్నారు. ఈ మేరకు విద్యుత్‌ సంస్థలు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ విధివిధానాలు, మార్గదర్శకా లను ఆమోదించాయి. ఈ దరఖాస్తుల పరిశీ లన కోసం కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవ మైన జూన్‌ 2న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను విలీనం చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేయా లని భావించినా.. దరఖాస్తుల పరిశీలనతో మరింత జాప్యం జరగనుంది.
 
ఒక్కో సంస్థలో రెండు కమిటీలు
తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (ట్రాన్స్‌కో), విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో), దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌), ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీ సీఎల్‌)లు మంగళవారం బోర్డు సమావేశాలు నిర్వహించి క్రమబద్ధీకరణ ఉమ్మడి మార్గద ర్శకాలను ఆమోదించాయి. క్రమబద్ధీకరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 23,667 మంది విద్యుత్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నుంచి దరఖాస్తులు వచ్చాయని... వారిలో అర్హులను గుర్తించేం దుకు ప్రతి విద్యుత్‌ సంస్థలో రెండు కమిటీల ను వేయాలని నిర్ణయించారు. ఒక్కో కమిటీ లో ఐదుగురేసి అధికారులు ఉంటారు.
 
వారికి మినహాయింపు..
మార్గదర్శకాల ప్రకారం.. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) ఖాతా ఉన్న విద్యుత్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులే రెగ్యులర్‌ ఉద్యోగులుగా విలీనానికి (అబ్జార్‌ప్షన్‌) అర్హులు కానున్నారు. అయితే 2016 డిసెంబర్‌ 4వ తేదీ నాటికి విద్యుత్‌ సంస్థల యాజమాన్యాల ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా నియమితులైన ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుంది. గతంలో విద్యుత్‌ సంస్థలు ప్రముఖుల సిఫారసుల ఆధారంగా చాలా మందిని నేరుగా కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా నియమిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశాయి. అలాంటివారు ఈపీఎఫ్‌ లేకున్నా క్రమబద్ధీకరణకు అర్హులవుతారు. ఇక ఈపీఎఫ్‌ ఉన్నా ప్రస్తుతం పనిచేయనివారు క్రమబద్ధీకరణకు అనర్హులు. కాగా.. విద్యుత్‌ సంస్థల యజమాన్యాలు ఈపీఎఫ్‌ సదుపాయం కల్పించకపోవడంతో మీటర్‌ రీడర్లు, బిల్‌ కలెక్టర్లు, రెవెన్యూ క్యాషియర్లు, ట్రాన్స్‌ఫార్మర్‌ రిపేర్‌ వర్కర్లు తదితర కేటగిరీల ఉద్యోగులు క్రమబద్ధీకరణకు అనర్హులవుతారని విద్యుత్‌ కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.
 
మూడు కేటగిరీలుగా విభజన
విద్యార్హతల ఆధారంగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను మూడు కేటగిరీలుగా విభజించారు. ఇంజనీరింగ్, డిప్లొమా ఇంజనీరింగ్, డిగ్రీ + కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ అర్హతలున్న వారిని అత్యున్నత నైపుణ్యం గల ఉద్యోగులుగా పరిగణిస్తారు. పదో తరగతితో పాటు ఐటీఐ చేసినవారు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి తెలుగు/ఉర్దూలో రాయడం, చదవడం తెలిసిన వారిని నైపుణ్యం గల ఉద్యోగులుగా... ఎలాంటి విద్యార్హతలు లేనివారిని నైపుణ్యం లేని ఉద్యోగులుగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఎలాంటి విద్యార్హతలు లేని 2,172 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు.
 
మరిన్ని మార్గదర్శకాలివీ..
► 18 ఏళ్ల నుంచి 58 ఏళ్లలోపు వయసున్న వారిని క్రమబద్ధీకరిస్తారు. 
►తెలంగాణ స్థానికత కలిగి ఇతర రాష్ట్రాల్లో చదవినా అర్హులే. తహసీల్దార్‌ జారీ చేసిన స్థానికత ధ్రువీకరణ పత్రం ఉంటే స్థానికులుగా పరిగణించనున్నారు.
► జీవిత భాగస్వామి ఏపీ లేదా ఇతర ప్రాంతాలకు చెందిన వారైతే సదరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు క్రమబద్ధీకరణకు అనర్హులవుతారు.
► భూములు కోల్పోయి సబ్‌స్టేషన్లలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికి అవకాశం ఉండదు.
 
విద్యార్హతలు లేని వారికీ అవకాశం
ఎలాంటి విద్యార్హతలు లేని వారిని వాచ్‌మన్‌ లాంటి కాంటింజెన్సీ పోస్టుల్లో భర్తీ చేస్తాం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా జూన్‌ 2న ఉద్యోగులను విలీనం చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేయాలని ముందు భావించాం. కానీ ఆలస్యమవు తోంది. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ ఉద్యోగులుగా విలీనం చేసుకు న్నా.. వారికి వెంటనే జీతభత్యాలు పెరగవు. అప్పటినుంచి వారికి లభించా ల్సిన ఇంక్రిమెంట్లు, ఇతర సదుపాయాలు లభిస్తాయి.
– ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు 
మరిన్ని వార్తలు