ఊచలు లెక్కిస్తున్న నకిలీ ఐఏఎస్

2 Jul, 2014 08:24 IST|Sakshi
ఊచలు లెక్కిస్తున్న నకిలీ ఐఏఎస్

నకిలీ ఐఏఎస్ అధికారి అవతారం ఎత్తి జైలు పాలయ్యాడు ఓ యువకుడు.నాంపల్లి  ఎస్సై నిపుణ్ తెలిపిన వివరాల ప్రకారం... జార్ఖాండ్ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగి నీరజ్ కుమార్ చతుర్వేది పట్టభద్రుడు. మూడేళ్ల క్రితం నకిలీ ఐఏఎస్ అధికారి అవతారం ఎత్తారు.  పుణే కేంద్రంగా చేసుకుని తమ కార్యకలాపాలను నిర్వహించాడు. ఏపీకి చెం దిన హార్టస్ కంపెనీ సీఈఓ రోహిత్‌కు ఒక రోజు రైలులో నీరజ్ కుమార్ చతుర్వేది ఐఏఎస్ అధికారిగా పరిచయం అయ్యారు. ఏవైనా పనులుం టే తన దృష్టికి తీసుకువస్తే చేసిపెడుతానని  చెప్పాడు. ఇటీవల హార్టస్ కంపెనీకి ఆదాయపన్ను శాఖ అధికారులతో పన్ను చెల్లింపు విషయంలో తగాదా వచ్చింది. ఈ సమస్యను అధిగమించేందుకు రోహిత్, నీరజ్ కు మార్ చతుర్వేదిని ఫోన్‌లో సంప్రదించారు.

 

హైదరాబాదు శాంతినగర్‌లో ఉండే ఆదాయపు పన్న శాఖ కమిషనర్ డి.శ్రీనివాస్‌ను కలిసేం దుకు నీరజ్ కుమార్ చతుర్వేది వచ్చారు. డి.శ్రీనివాస్‌తో నీరజ్ కుమార్ చతుర్వేది తాను ఒక ఐఏఎస్ అధికారినంటూ పరిచయం చేసుకున్నారు. ఈ పరిచయంలో ఆదాయపు శాఖ కమిషనర్ డి.శ్రీనివాస్‌కు అనుమా నం వచ్చింది. వివరాలను సేకరిస్తే నకిలీ ఐఏఎస్ అధికారిగా తేలింది. దీంతో నాంపల్లి పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
 

మరిన్ని వార్తలు