పునరావాసంపై తప్పుడు సమాచారం

24 Nov, 2016 04:10 IST|Sakshi
పునరావాసంపై తప్పుడు సమాచారం

సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గిరిజన గ్రామాలైన పోలవరం, దేవీపట్నం, అంగులూరు, కుకునూరు, కూనవరం నిర్వాసితులకు సహాయ, పునరావాస చర్యల కల్పన విషయంలో కేంద్ర గిరిజనశాఖ సహాయ మంత్రి జస్వంత్‌సింగ్ భాభోర్ బుధవారం రాజ్యసభలో రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తానడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానమివ్వకుండా తప్పించుకునే ధోరణిలో మంత్రి వివరాలు తెలపడంపై రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేయాలని ఆయన నిర్ణరుుంచారు. 

అందువల్ల ఇది కచ్చితంగా సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అభిప్రాయ పడ్డారు. తాను చేస్తున్న ఫిర్యాదును పార్లమెంటు సభాహక్కుల సంఘం ముందుంచాలని కోరాలని ఆయన నిర్ణరుుంచారు. ‘గిరిజనులకు భూమి హక్కు’ కల్పించాలన్న ప్రధాని ప్రకటనననుసరించి పోలవరం, దేవీపట్నం, అంగులూరు, కుకునూరు, కూనవరం నిర్వాసిత గిరిజనుల నుంచి కారుచౌకగా ప్రభుత్వం తీసుకున్న భూమిని వారికే తిరిగి అప్పగించడానికి ఏం చర్యలు తీసుకున్నారు? ఇక్కడి అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులపై సర్వే నిర్వహణకు చర్యలు తీసుకున్నారా?అని విజయసారుురెడ్డి ప్రశ్నించగా.. మంత్రి సూటిగా సమాధానాలివ్వలేదు.

>
మరిన్ని వార్తలు