సీఎం కార్యాలయం వద్ద కలకలం

13 Jul, 2017 18:21 IST|Sakshiహైదరాబాద్‌:

పంజాగుట్టలోని సీఎం క్యాంపు ఆఫీస్ ముందు ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. నల్లగొండ జిల్లాకు చెందిన నాగరాజు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సీఎం కార్యాలయం వద్దకు కూతురు నవ్య(13), మేనల్లుడు శ్రీనివాస్(18)తో కలిసి వచ్చారు. సీఎం లేకపోవడంతో పాటు, కార్యాలయంలోకి సిబ్బంది అనుమతించలేదు.

దీంతో ముగ్గురు కలిసి తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగారు. విషయం గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే వారిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి  తరలించారు. గాంధీలో వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.