ఫాదర్స్‌ డే సందర్భంగా తండ్రుల వినూత్న నిరసన

19 Jun, 2016 14:06 IST|Sakshi
ఫాదర్స్‌ డే సందర్భంగా తండ్రుల వినూత్న నిరసన

హైదరాబాద్ : వారంతా పిల్లల ఆత్మీయతకు దూరమైన తండ్రులు. కోర్టు తీర్పుల కారణంగా పిల్లలకు దూరమై మానసికంగా వేదన చెందుతున్నవారు. తండ్రుల దినోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలోని ఇందిరాపార్క్ వద్ద వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. భార్యా భర్తలు విభేదాలతో విడిపోయిన కేసుల్లో... పిల్లలను తల్లుల కస్టడీకి అప్పగించడం వల్ల తాము వారి ఆప్యాయతకు దూరమవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తల్లులకు పూర్తి కస్టడీ ఇవ్వడం అంటే పిల్లలను హింసించడమేనని, తండ్రి అంటే వీర్యదాత కాదని, సమాన హక్కులు, సమాన తల్లిదండ్రులు, సమాన ప్రేమ, నేను తండ్రిని ఉగ్రవాదిని కాదు.. అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.

>
మరిన్ని వార్తలు