ప్రజా సమస్యలపై పోరుబాట

15 Aug, 2016 01:27 IST|Sakshi
ప్రజా సమస్యలపై పోరుబాట

పార్టీ విస్తరణ, ఉద్యమాలపై సీపీఎం దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో విద్య, వైద్యం, ఇళ్లు, భూమి, ఉపాధి వంటి ప్రధానమైన సమస్యలపై ఉద్యమించాలని సీపీఎం నిర్ణయించింది. వివిధ జిల్లాల్లో నీటిపారుదల ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపన వల్ల నిర్వాసితులవుతున్నవారి సమస్యలపై ఉధృతంగా పోరాటాలు చేయాలని తీర్మానించింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సంస్థాగత నిర్మా ణం, విస్తరణకు గ ట్టి చర్యలు తీసుకుంటూనే ప్రజాసమస్యలపై పోరాడి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 16,17,18 తేదీల్లో జరగనున్న రాష్ర్టపార్టీ ప్లీనంలో కార్యాచరణను ఖరారు చేయాలని నేతలు భావిస్తున్నారు.

జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు  దిశానిర్దేశనం చేయనున్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పథకం అమలుకు గట్టిగా పట్టుబట్టేలా కార్యక్రమాలను రూపొందించనుంది. రాష్ట్రంలో అధికశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీవారు ఉండడంతో సామాజిక న్యాయ ఎజెండాతో ముందుకు సాగాలని పార్టీ నిర్ణయించింది.

మరిన్ని వార్తలు