కేఎస్ vs ఎంవీ

14 Sep, 2015 00:02 IST|Sakshi
కేఎస్ vs ఎంవీ

20న  ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికలు
బరిలో  కేఎస్ రామారావు, ఎంవీ చౌదరి
 

బంజారాహిల్స్: ఫిలింనగర్ కల్చరల్ సెంటర్(ఎఫ్‌ఎన్‌సీసీ) కార్యవర్గ ఎన్నికలు ఈ నెల 20న జరుగనున్నాయి.  ప్రస్తుత అధ్యక్షుడు కేఎస్‌రామారావుతో పాటు శ్రీమిత్ర రియల్టర్స్ అధినేత మేడికొండూరి వెంకటచౌదరి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఈ రెండు ప్యానెళ్లు హోరాహోరీగా పోటీ పడుతుండగా గెలుపు కోసం అభ్యర్థులు వ్యూహరచన చేస్తున్నారు. క్లబ్‌లో అందరూ బడాబాబులు, సినీ దిగ్గజాలు ఉండటంతో ఈ పోటీ రసవత్తరంగా మారింది. క్లబ్‌లో మొత్తం 2100 మంది సభ్యులుండగా ఇందులో మెగాస్టార్ చిరంజీవి, కె.రాఘవేందర్‌రావు, అల్లు అర్జున్, రాంచరణ్‌తేజ్, శ్రీకాంత్, మోహన్‌బాబు, మంచు విష్ణు, దాసరి నారాయణరావు, వెంకటేష్, మహేష్‌బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, దగ్గుబాటి రానా, కోట శ్రీనివాసరావు, కోడి రామకృష్ణ, బి.గోపాల్, ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, వైవి.రెడ్డి, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ మాగంటి బాబు, ఎంపీ మురళీమోహన్ తదితరులు సభ్యులుగా ఉన్నారు.
 
కేఎస్ రామారావు ప్యానెల్

 కె.ఎస్.రామారావు అధ్యక్షుడిగానే పోటీ పడుతున్నారు. ఉపాధ్యక్షుడిగా డాక్టర్ కేవీ.రావు, కార్యదర్శిగా బి. రాజశేఖర్‌రెడ్డి,కోశాధికారిగా సిహెచ్.శ్రీనివాసరాజు, సంయుక్త కార్యదర్శిగా తుమ్మల రంగారావు, కార్యవర్గ సభ్యులుగా రవీంద్రనాథ్, రఘునందన్‌రెడ్డి,సూర్యనారాయణరాజు, మదన్‌మోహన్ రావు ఉన్నారు.
 
 ఎంవీ చౌదరి ప్యానెల్
 ఎంవీ.చౌదరి అధ్యక్షుడిగా పోటీ చేస్తుండగా ఉపాధ్యక్షుడిగా నందమూరి తారకరత్న, సెక్రటరీగా యలమంచిలి సురేష్‌కుమార్, కోశాధికారిగా శివాజీరాజా, జాయింట్ సెక్రటరీగా జితేందర్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా సురేష్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి,భూపాల్‌వర్మ,శ్రీనివాస్‌రావు ఉన్నారు.
 
 

మరిన్ని వార్తలు