ఫోర్జరీ సంతకంతో సినిమా అమ్మేశాడు...!

23 Mar, 2016 03:07 IST|Sakshi
ఫోర్జరీ సంతకంతో సినిమా అమ్మేశాడు...!

డెరైక్టర్ అరెస్టు
 
 

పంజగుట్ట: నిర్మాత సంతకాన్ని ఫోర్జరీ చేసి.. సినిమా హక్కులను విక్రయించిన ఓ డెరైక్టర్‌ను పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.... అమీర్‌పేటకు చెందిన జానా రామారావు సినీ నిర్మాత. మహంతి పి.కె అలియాస్ మహంతి పద్మారావు(35) అనే డెరైక్టర్‌తో కలిసి భారీ మొత్తం ఖర్చుపెట్టి ‘అమ్మయిలూ టేక్ కేర్’ అనే సినిమా తీశారు. సినిమా రిలీజ్ చేసే సమయంలో డెరైక్టర్ మహంతి ఫిలింనగర్‌కు చెందిన సతీష్ చౌదరికి రామారావు ఫోర్జరీ సంతకంతో సినిమా హక్కులు అమ్మేశాడు.

అంతటితో ఆగకుండా సినిమా పేరును ‘వాడు వీడు ఓ కల్పన’ అని మార్చి ఈనెల 10న ఆడియో రిలీజ్ చేశారు. విషయం తెలుసుకున్న రామారావు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు డెరైక్టర్ మహంతిని అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. కాగా సినిమా హక్కులను కొన్న సతీష్ చౌదరి, కేసుతో సంబంధం ఉన్న కృష్ణ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.  
 

మరిన్ని వార్తలు