నేటి నుంచి తుది విడత కౌన్సెలింగ్

24 Jul, 2016 03:23 IST|Sakshi

- 24న ధ్రువపత్రాల పరిశీలన, 25 వరకు ఎంసెట్ 1 వెబ్‌ఆప్షన్లు
- ఎంసెట్-1 కౌన్సెలింగ్ వివరాలు
- తొలుత ప్రకటించిన సీట్లు        9,123
- కేటాయించిన సీట్లు        57,940
- మిగిలిపోయిన సీట్లు        11,183
 - గడువులోగా రిపోర్టు చేసినది    44,420
-  తుదిదశకు కొత్తగా జతయిన సీట్లు    1,403
-  తుదిదశకు అందుబాటులోని సీట్లు    26,106
 
 సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సీట్ల భర్తీకోసం నిర్వహించిన ఎంసెట్-1 తుది విడత కౌన్సెలింగ్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. మొత్తంగా 26 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. తొలిదశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకుని సీట్లు రాని అభ్యర్థులతోపాటు ఎంసెట్‌లో ర్యాంకులు పొందినా తొలిదశ కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. 24న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 21 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. ఇక తొలిదశలో సీట్లు పొందిన అభ్యర్థులు కూడా మెరుగైన కళాశాల/కోర్సులను ఎంచుకునేందుకు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. 24, 25వ తేదీల్లో అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
 
 ఈనెల 27న రాత్రి 8 గంటల తర్వాత సీట్ల కేటాయింపు చేపడతారు. ఇక జేఎన్టీయూహెచ్ ఇటీవల అఫిలియేషన్ ఇచ్చిన మరో మూడు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులను ఏఎఫ్‌ఆర్సీ నిర్ధారించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో తొలిదశలో మిగిలిపోయిన సీట్లకు అదనంగా మరో 1,403 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే మరో రెండు బీఫార్మసీ కళాశాలలకు, ఒక ఫార్మ్-డి కళాశాలకు జేఎన్టీయూహెచ్ అఫిలియేషన్ ఇచ్చినందున.. వాటికి కూడా ఏఎఫ్‌ఆర్సీ ఫీజులను నిర్ధారించింది. మరో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో 60 సివిల్ ఇంజనీరింగ్ సీట్లకు అనుమతిస్తూ ఇంకో ఉత్తర్వును విద్యాశాఖ జారీచేసింది.

మరిన్ని వార్తలు