బేగంపేటలోని చెప్పుల దుకాణంలో అగ్నిప్రమాదం

20 Jul, 2014 08:14 IST|Sakshi

బేగంపేట శ్యామ్లాల్ బెల్డింగ్ సమీపంలోని మోచీ చెప్పుల దుకాణంలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దాంతో అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని... మంటలార్పుతున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. చెప్పుల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు