జీడిమెట్లలోని కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

29 Jun, 2016 08:03 IST|Sakshi
జీడిమెట్లలోని కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో బుధవారం వేకువజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక గంపలబస్తీలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దీంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకోవటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదానిక గల కారణాలు తెలియాల్సిఉంది.

మరిన్ని వార్తలు