రైల్ నిలయంలో మంటలు.. ఉద్యోగుల పరుగులు

5 Nov, 2016 14:11 IST|Sakshi
రైల్ నిలయంలో మంటలు.. ఉద్యోగుల పరుగులు
సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం 12.30-1.00 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ముందుగా స్క్రాప్ రూంలో మంటలు వచ్చాయని సిబ్బంది అంటున్నారు. ఈ మంటలను గమనించగానే ఉద్యోగులు ముందుగా ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కానీ అప్పటికే గది మొత్తం మంటలు వ్యాపించాయి. 
 
ఆ గదిలో స్క్రాప్ పేపర్లు, ఆయిల్‌కు సంబంధించిన వస్తువులు ఉన్నాయి.. అవన్నీ కాలిపోయాయి. రైల్ నిలయంలో వెయ్యి మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తారు. ప్రమాదం విషయం తెలియగానే వాళ్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి, బయటకు పరుగులు తీశారు. ఏ కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లనా.. మరేదైనా కారణం ఉందా అని చూస్తున్నారు. మరికొన్నిచోట్లకు కూడా మంటలు వ్యాపిస్తున్నాయని అంటున్నారు. దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించిన సికింద్రాబాద్‌లో ఈ తరహా ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి. 
Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు