నాచారం కెమికల్‌ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం

22 May, 2016 18:47 IST|Sakshi

హైదరాబాద్‌: నగరంలోని నాచారం పారిశ్రామిక వాడలో ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కెమికల్‌ కంపెనీలో అంటుకున్న మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. రెలీమ్యాక్స్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ కంపెనీ ల్యాబ్‌లో మంటలు చెలరేగడంతో అక్కడి స్థానికుల అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.

దాంతో హుటాహుటినా ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు తెలిసింది. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు