పేరుకుపోయిన చెత్త: ఐదుగురికి డెంగీ

8 Jul, 2015 20:23 IST|Sakshi
పేరుకుపోయిన చెత్త: ఐదుగురికి డెంగీ

హైదరాబాద్: మహానగరంలో మహమ్మారి వ్యాధులు ప్రబలుతున్నాయి. ఎక్కడిక్కడ నిలిచిపోయిన చెత్తనుంచి పుట్టిన ప్రమాదకర కీటకాలు విజృంభిస్తున్నాయి. గడిచిన మూడు రోజులుగా జీహెచ్ఎంసీ కార్మికులు సమ్మె చేస్తుండటం, ప్రభుత్వాల పట్టింపులేనితనంతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం వాటిల్లింది.

జీహెచ్ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్లో బుధవారం ఐదుగురు డెంగీ వ్యాధికి గురై ఆసుపత్రిలో చేరారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. చెత్త తొలిగింపునకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో జీహెచ్ఎంసీ మొత్తం మురికికూపంలా మారింది. దీంతో ప్రమాదకర వ్యాధులు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశముంది.

మరిన్ని వార్తలు