8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ

4 Jun, 2015 18:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: బత్తిని సోదరులు అందించే చేప ప్రసాదం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 8, 9 తేదీల్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరగనున్న ఈ కార్యక్రమం సవ్యంగా జరిగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయిచింది. ఈ మేరకు నిర్వహణ కమిటీతో పాటు సంబంధిత అధికారులతో రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు.

చేప పిల్లల నిల్వకు సరిపడే వాటర్ ట్యాంకులను అందుబాటులో ఉంచటంతో పాటు ప్రసాదం పంపిణీకి సరిపడే కౌంటర్లు ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వికాస్‌రాజ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నిర్మల, పోలీస్ అడిషనల్ కమిషనర్ అంజనీ కుమార్, ఫిషరీస్ డెరైక్టర్ ఎం.జగదీశ్వర్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు