టీడీపీకి మాజీ కార్పొరేటర్ రాజీనామా

22 Jan, 2016 01:13 IST|Sakshi

నల్లకుంట: గ్రేటర్ ఎన్నికల్లో సిట్టింగ్ కార్పొరేటర్లకు ప్రథమ ప్రాధాన్యమిస్తామని చెప్పిన అధిష్టానం బీ ఫారం మరొకరికి ఇవ్వడం విస్మయాన్ని కలిగించిందని మాజీ కార్పొరేటర్ అడపా చంద్రమౌళి ఆరోపించారు. నాయకుల తీరుతో తీవ్ర మనస్థాపానికి గురైన తాను టీడీపీకి సభ్యత్వానికి రాజీ నామా చేస్తున్నానని తెలిపారు. ఆయనతో పాటు తెలుగు యువత గ్రేటర్ ఉపాధ్యక్షుడు అడపా జనార్దన్, నల్లకుంట డివిజన్ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్ నేతృత్వంలో పలువురు నేతలు శివం రోడ్డులో టీడీపీ జెండా దిమ్మెను కూల్చివేశారు.

రాజీనామా లేఖలను పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయకుడికి ఫ్యాక్స్‌లో పంపించామనానరు. రాజీనామా చేసిన వారిలో డివిజన్ ఉపాధ్యక్షుడు బి.సత్యనారాయణ యాదవ్, అధికార ప్రతినిధి సునీల్, కోశాధికారి ఈశ్వర్, తెలుగు యువత అధ్యక్షుడు ఎంజీ.రాఘవేందర్, నాయకులు శివమోహన్, యాదగిరి గౌడ్, రామకృష్ణ, అభిషేక్, రామకృష్ణ యాదవ్, అభిషేక్, భార్గవి. శేఖర్ గౌడ్, సతీశ్, రోహిత్, శివకృష్ణ యాదవ్, కునాల్ సింగ్, ఆర్.శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

టీడీపీలో గుర్తింపు లేదు
చందానగర్: తెలుగుదేశంలో తెలంగాణ వారికి గుర్తింపు లేదని మాజీ కార్పొరేటర్ అశోక్‌గౌడ్, శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు రమణ గౌడ్, సునీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చందానగర్ గాంధీ విగ్రహం వద్ద చంద్రబాబు, లోకేష్, ఎమ్మెల్యే గాంధీల ఫ్లెక్సీలు, జెండాలను గురువారం తగులబెట్టారు. నాయకులు ప్రభాకర్‌రెడ్డి, అన్వర్‌షరీఫ్, నూతక్కి పూర్ణచందర్‌రావు, నజీర్, బీఎస్‌ఎన్ కీరణ్ యాదవ్ పాల్గొన్నారు.

టీడీపీ- బీజేపీ ఆందోళన
ఉప్పల్: ఉప్పల్, హబ్సిగూడ వార్డులను టీడీపీకి కేటాయించగా...అభ్యర్థులు బీఫారాలను సమర్పించారు. బీజేపీ అభ్యర్థులు కూడా  ఈ డివిజన్‌ల నుంచి బీఫారాలను సమర్పించడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ప్రభాకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్‌ను బీజేపీ అభ్యర్థి గణేష్ ముదిరాజ్ కు కేటాయించగా... ఆ స్థానానికి టీడీపీకి చెందిన మల్లేశ్ వంశరాజ్ బీఫారం అందజేయడంతో బీజేపీ వర్గాలు నిరసన వ్యక్తం చేశాయి.

మరిన్ని వార్తలు