'ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది'

6 Oct, 2016 12:28 IST|Sakshi
'ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది'
హైదరాబాద్ : కొత్త జిల్లాలపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కొత్త జిల్లాలపై ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావును గురువారం ఆయన కలిశారు.
 
వెంటనే జనగామ జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలపై న్యాయపరమైన చిక్కులు రాకుండా జ్యుడిషియరీ కమిటీ ఏర్పాటు చేయాలని పొన్నాల సూచించారు.
 
మరిన్ని వార్తలు