ఉమ్మడి హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు

16 Jan, 2017 03:09 IST|Sakshi
ఉమ్మడి హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు
  • రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ.. నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం
  • 17న ప్రమాణ స్వీకారం చేయనున్న కొత్త న్యాయమూర్తులు
  • సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులుగా డాక్టర్‌ షమీమ్‌ అక్తర్,  జవలకర్‌ ఉమాదేవి, నక్కా బాలయోగి, తెల్లప్రోలు రజని నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వీరి నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మంగళవారం ఈ నలుగురు న్యాయమూర్తులుగా ప్రమాణం చేయనున్నారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ వీరితో ప్రమాణం చేయించనున్నారు.

    వీరి నియామకంతో హైకోర్టు న్యాయ మూర్తుల సంఖ్య 27కు చేరింది. జిల్లా జడ్జీల కోటాలో వీరు హైకోర్టు న్యాయ మూర్తులుగా నియమితుల య్యారు. డాక్టర్‌ షమీమ్‌ అక్తర్‌ జన్మస్థలం నల్లగొండ జిల్లా. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు రిజిష్ట్రార్‌(జ్యుడీషియల్‌)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జె.ఉమాదేవి జన్మస్థలం అనంతపురం జిల్లా. ప్రస్తుతం హైదరాబాద్‌ సిటీ స్మాల్‌ కాజెస్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నక్కా బాల యోగి తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ సిటీ సివి ల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా ఉన్నారు. ప్రకాశం జిల్లాలో జన్మించిన టి.రజని ప్రస్తుతం హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మరిన్ని వార్తలు