అగాధమే.. ఆత్మహత్యకు కారణమా?

1 Aug, 2016 12:04 IST|Sakshi
అగాధమే.. ఆత్మహత్యకు కారణమా?

* ఒకే కుటుంబంలో నలుగురి బలవన్మరణం ఘటన
* సత్యనారాయణ కుటుంబం చాలాకాలంగా బంధువులకు దూరం
* మృతదేహాన్ని ఎటు తీసుకెళ్లాలో తెలియక అయోమయం
* ఆ సంఘర్షణతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం

ఘట్‌కేసర్: కుటుంబ పెద్ద మృతదేహన్ని సొంతూరుకు తీసుకెళ్తే ఎదురయ్యే వ్యతిరేకతకు భయపడే నలుగురు ఆత్మహత్య చేసుకొని ఉంటారని మృతుల సమీప బంధువులు తెలిపారు.

వరంగల్ జిల్లా మద్దూరు మండలం లద్నూరు గ్రామానికి చెందిన పారుపల్లి సత్యనారాయణ (55) అనారోగ్యంతో మృతి చెందగా.. భార్య మీరా, కూతుళ్లు స్వాతి, నీలిమ, కుమారుడు శివరామకృష్ణ శుక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సత్యనారాయణ ఆదిలాబాద్ జిల్లాలో హౌసింగ్ డీఈగా పనిచేస్తున్నారు. భార్యాపిల్లలు వరంగల్ జిల్లా హన్మకొండలోని టీచర్స్ కాలనీలో ఉంటున్నారు. తల్లిదండ్రులు లద్నూరులోనే నివాసం ఉంటున్నారు. ఆరోగ్యం దెబ్బతినడంతో సత్యనారాయణను చికిత్స నిమిత్తం తరలిస్తుండగా భువనగిరిలో మృతిచెందాడు. అరుుతే మృతదేహాన్ని ఎక్కడికి తీసుకెళ్లి కర్మకాండలు నిర్వహించాలనే సమస్య కుటుంబసభ్యులకు ఎదురైంది.

హన్మకొండలో అద్దె ఇంట్లో కర్మకాండలకు ఇంటివారు అనుమతించరు. మీరాకు తల్లిగారింటితోనూ సత్సంబంధాలు లేవు. చాలాకాలంగా సత్యనారాయణ తల్లిదండ్రులకు రాకపోకలు లేవు. ఇన్నేళ్ల తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్తే ఇప్పుడు గుర్తొచ్చామా అంటారు. ఈ  వ్యతిరేకతకు భయపడే ఆత్మహత్య చేసుకుని ఉంటారని బంధువులు భావిస్తున్నారు. పరిస్థితుల గురించి తమకు సమాచారం ఇచ్చి ఉంటే తాము ధైర్యం చెప్పే వారమని వారు అంటున్నారు. కుమిలిపోరుు, మానసిక సంఘర్షణతో చావే పరిష్కారమని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు పెళ్లీడుకొచ్చిన పిల్లలకు వివాహాలు కాకపోవడం కూడా ఆందోళనకు కారణమై ఉంటుందన్నారు.
 
కొత్త కారు సంబరం నాలుగు రోజులే..

కొత్త కారు తీసుకొని గత నెల 26న రిజిస్టర్ చేరుుంచారు. నాలుగు రోజులే అందులో తిరిగారు. మృతుని కుమారుడు శివరామకృష్ణ డ్రైవింగ్ చేసేవాడు. గత నెల 29న తండ్రి మృతితో వారు సైతం ఆత్మహత్య చేసుకున్నారు. చివరిసారి నల్లగొండ జిల్లాలో భువనగిరిలోని హోటల్‌లో భోజనం చేస్తే , ఘట్‌కేసర్ మండలం అంకుశాపూర్‌లో తుదిశ్వాస వదిలారు.
 
డీఈగా రెండు సంవత్సరాలే..
సత్యనారాయణ హౌసింగ్ బోర్డులో ఏఈగా వరంగల్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలో పనిచేసి సస్పెండ్‌కు గురయ్యారు. చాలాకాలం విరామం తరువాత డీఈగా ప్రమోషన్ పై ఆసిఫాబాద్‌కు బదిలీపై వెళ్లారు. మద్యానికి బానిసై ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోలేదు. అక్కడ రెండేళ్లే పనిచేసి మృతిచెందారు.  
 
ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం
సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యుల మృతదేహాల నుంచి రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ పోలీసులు ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయూ ఫోన్లలోని కాల్ డేటా వెలుగుచూస్తే.. సత్యనారాయణను హైదరాబాద్ తీసుకొచ్చే క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు ఎవరితోనైనా ఫోన్లలో మాట్లాడారా అనేది తెలుస్తుంది. తద్వారా ఆయన కుటుంబం ఆత్మహత్మకు కారణాలు తెలియవ చ్చని భావిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు