నాలుగు మార్గాల్లో ఎక్స్‌ప్రెస్-వే

30 Nov, 2014 00:25 IST|Sakshi
నాలుగు మార్గాల్లో ఎక్స్‌ప్రెస్-వే

ఈ రూట్లలో... అల్వాల్ - బేగంపేట- మాదాపూర్
ఎల్‌బీనగర్ - ఆరాంఘర్ - గచ్చిబౌలి
కొంపల్లి - బోయిన్‌పల్లి - ప్యారడైజ్
మాదాపూర్ - గచ్చిబౌలి - బీహెచ్‌ఈఎల్ - పటాన్‌చెరు
 

సిటీబ్యూరో: విశ్వ ఖ్యాతి... చూడచక్కని ఆకాశహర్మ్యాలు.. మురికివాడలు లేకుండా వంటి చర్యలతో హైదరాబాద్‌ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలనుకుంటున్న సీఎం కేసీఆర్ ఆలోచనలకనుగుణంగా జీహెచ్‌ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులోభాగంగా ట్రాఫిక్ సమస్యపైనా దృష్టి సారించారు. తొలిదశలో నాలుగు కారిడార్లను ఎక్స్‌ప్రెస్ వేలుగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఎక్కడా రెడ్ సిగ్నల్ పడకుండా వీటిని తీర్చిదిద్దనున్నారు. ఇందుకుగాను అవసరమైన మేర ఫ్లైఓవర్లు.. స్పైరల్ మార్గాలను నిర్మించనున్నారు. వరదనీటి పారుదల, డక్టింగ్ తదితర ఏర్పాట్లు చేయనున్నారు. ఇలాంటి సదుపాయాలతో రహదారులను తీర్చిదిద్దేందుకు దిగువ మార్గాలపై దృష్టి సారించారు.

ఎంపిక చేసిన ఈ నాలుగు మార్గాల్లో అడ్డంకులు, సిగ్నలింగ్ ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై నివేదికలు రూపొందించాలని కన్సల్టెంట్లను ఆహ్వానించనున్నారు. అందుకనుగుణంగా అవసరమైన చర్యల కోసం ప్రభుత్వంతో సమావేశం జరుపనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషన ర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఎక్స్‌ప్రెస్ కారిడార్లపై ఇంజినీరింగ్ అధికారులు, ట్రాఫిక్ విభాగం సీనియర్ అధికారులతో సోమేశ్‌కుమార్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పైమార్గాలను ఎక్స్‌ప్రెస్‌వేలుగా తీర్చిదిద్దాలని  ప్రతిపాదించారు. వీటి ని ప్రభుత్వ ఆమోదం కోసం పంపించనున్నారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నందునే పై నాలుగు మార్గాలను ఎంపిక చేశామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫి క్ ఇబ్బందులు లేకుండా చేయాలని భావిస్తున్నామన్నారు. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని కన్సల్టెంట్లను కోరనున్నామని, వారి నివేదిక ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
 

మరిన్ని వార్తలు