ఇక ఏపీలో పూర్తిస్థాయి ఇసుక పాలసీ

5 Apr, 2016 19:20 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై ఇసుక పాలసీ విధానం పూర్తిస్థాయిలోకి రానుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి ఇసుక పాలసీని ప్రకటిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం 524 ఇసుక రీచ్లను గుర్తించింది. నదీ ప్రాంతంలో 166, వాగు ప్రాంతాల్లో 358 ఇసుక రీచ్లను గుర్తించింది.

అదేవిధంగా లోడింగ్ ఛార్జీలు చెల్లించాకే ఇసుక రీచ్లోనుంచి ఇసుక తీసుకెళ్లాలని ఆదేశించింది. ఇసుక పాలసీ విధానంలో లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ణయించే అధికారం ఆయా జిల్లా కలెక్టర్లకు ఏపీ ప్రభుత్వం అప్పగించినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు