దేవుడితో ‘అసెస్‌మెంట్’ దందా

12 Dec, 2016 14:57 IST|Sakshi
దేవుడితో ‘అసెస్‌మెంట్’ దందా

దేవాదాయశాఖ పరిధిలోకి ఆలయాల మళ్లింపులో చేతివాటం
- రూ. 50 వేల పరిమితి ప్రాతిపదికగా 633 ఆలయాలకే గుర్తింపు
- ఇప్పుడు వాటి సిబ్బందికే కొత్త వేతన విధానం అమలు యోచన
- మిగతా ఆలయాల్లో అలజడి
- అస్తవ్యస్త విధానాన్ని పట్టించుకోని మంత్రివర్గ ఉపసంఘం  
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘నెలకు రూ.50 వేలకుపైబడి ఆదాయం ఉన్న దేవాలయాలకు కొత్త వేతన విధానం అమలు చేయాలి’’ ఇది తాజాగా దేవాదాయశాఖ పనితీరును సమీక్షించి సిఫారసులు చేసేందుకు ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ప్రాథమిక నిర్ణయం. ఇప్పుడీ వ్యవహారం దేవాదాయశాఖలోని అస్తవ్యస్త వ్యవస్థను మరోసారి బట్టబయలు చేసింది. ఇంత ఆదాయం ఉన్న ఆలయాల ఆదాయన్ని సమీక్షించి దేవాదాయశాఖ అధీనంలోకి తీసుకుని, నిర్వహణకు సిబ్బందిని నియమించి కొనసాగిస్తోంది. ఇప్పుడు ఇలాంటి ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అర్చకులకు కొత్త వేతన విధానం అమలు చేయాలనే దిశగా అడుగులు పడుతున్నారుు. కానీ... అలా సమీక్షించిన దేవాలయాల జాబితాలో లేని ఆలయాల్లో చాలావాటి ఆదాయం మరింత ఎక్కువగా ఉంది.

కానీ అవి దేవాదాయశాఖకు పన్ను చెల్లించ డం లేదు. ఇప్పటికీ పాలకమండళ్ల అధీనంలో అవి నడుస్తున్నారుు. అలాంటి ఆలయాలు దేవాదాయశాఖ అధీనంలోకి వెళ్లకుండా కొందరు తెరవెనక చక్రం తిప్పుతున్నారని, ఇందులో భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయనేది తాజాగా వెల్లడైన వివాదం. ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం ఆ దిశగా దృష్టి సారించి దేవాదాయశాఖలో జరుగుతున్న ఇష్టారాజ్యానికి చెక్ చెప్పాల్సి ఉంది. కానీ.. ఆ తేనెతుట్టెను ముట్టుకోవడం కంటే.. జాబితాలో చోటు దక్కించుకున్న తక్కువ సంఖ్యలోని ఆలయాలకే కొత్త వేతనాలను వర్తింపజేసి చేతులు దులుపుకోవాలనే సూచనలు వారి చెవులకందుతుండటం విశేషం.

 ఏంటీ గందరగోళం..?
 ప్రస్తుతం రాష్ట్రంలో దేవాదాయశాఖలో రిజిస్టర్ అరుున దేవాలయాలు 12 వేలకుపైగా ఉన్నారుు. రిజిస్టర్ కానివి వేలల్లో ఉన్నారుు. దేవాదాయశాఖ నోటిఫై చేసిన (అసెస్‌డ్) ఆలయాలు మాత్రం కేవలం 633. వీటిల్లో సిబ్బం దితోపాటు అర్చకులకు ఆలయ ఆదాయం నుంచే వేతనాలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఆల య ఉద్యోగులు, అర్చకుల డిమాండ్ మేరకు ప్రభుత్వమే వారికి జీతాలు చెల్లించాలని నిర్ణరుుంచింది. ఈ నిర్ణయాన్ని కేవలం ఈ 633 ఆలయాలకే వర్తింపజేయాలనే దిశగా అడుగులు పడుతున్నారుు. ఇక్కడే వివాదం రాజు కుంది. తామేం తప్పు చేశామంటూ మిగతా ఆలయాల అర్చకులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడే అసలు గుట్టు వెల్లడవుతోంది. రూ. 50 వేలు వస్తున్న ఆలయాలన్నింటితో అసెస్డ్ జాబితాను రూపొందిం చారు.

కానీ.. అసెస్డ్ జాబితాలో లేని చాలా ఆలయాల ఆదాయం అంతకంటే చాలారెట్లు అధికంగా ఉంది. వాటిని దేవాదాయశాఖ పరిధిలోకి వెళ్లకుండా ఆ ఆలయాల పాలకమండళ్లు తెరవెనక మంత్రాంగం నడుపుతున్నారుు. దీనివల్ల వాటి నుంచి ప్రభుత్వానికి రావాల్సిన 12 శాతం కాంట్రిబ్యూషన్ రాకపోవటమే కాకుండా, ఆలయానికి వస్తున్న భారీ ఆదాయానికి లెక్కాపత్రం లేకుండా పోరుుంది. వీటిలో కొన్ని ఆలయాలను అసెస్ చేసేందుకు దేవాదాయశాఖ నోటీసులు జారీ చేసినా స్వయంగా కొందరు మంత్రులు రంగంలోకి దిగి వాటిని ఉపసంహరింప చేస్తున్నట్టు ఆరోపణలున్నారుు. ఇటీవల ఫిల్మ్‌నగర్‌లోని దైవసన్నిధానానికి అధికారులు నోటీసు జారీ చేసినా ఓ నేత ఒత్తిడితో అది వెనక్కు మళ్లింది. చాలా ఆలయాల పరిస్థితి ఇదే. దేవాదాయశాఖలోని పరిస్థితులను చక్కదిద్దేందుకు మంత్రుల కమిటీ దీనిపై దృష్టి సారించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు