అలలపై ఆట

1 Jul, 2014 00:42 IST|Sakshi
అలలపై ఆట

డీలైట్ మాన్‌సూన్ రెగెట్టా పోటీలకు నగరం సిద్ధమైంది. అమెరికా కప్ ఫార్మాట్ తరహాలో తొలిసారిగా హుస్సేన్‌సాగర్‌లో మంగళవారం నుంచి నిర్వహిస్తున్న సెయిలింగ్ పోటీలకు సెయిలర్లు సన్నద్ధమయ్యారు. ఈసారి రూ.కోట్ల విలువ చేసే అమెరికా బోట్లతో పోటీల్లో పాల్గొననుండటం నగరవాసులను ఆకర్షిస్తోంది. ఫ్లీట్ రేసింగ్, మ్యాచ్ రేసింగ్‌లు వురో ఆకర్షణ. పోటీలు టీవీలో కూడా ప్రసారవువుతారుు. అవగాహన కోసం సెయిలర్లకు ఇప్పటికే ప్రత్యేక కోర్సుల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కొత్త తరహా నిబంధనల వల్ల బోట్లు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండదు. సెయిలర్లకు పూర్తి రక్షణ ఉంటుంది.

ఏయే విభాగాలు...

అప్టిమిస్ట్ (అండర్-15), టాపర్ (అండర్-19), ఒమెగా (పిల్లల నుంచి పెద్దల వరకు)  విభాగాల వారీగా ఈ పోటీలు ఉంటాయి. లక్ష రూపాయల విలువ చేసే అప్టిమిస్ట్ బోట్లను పిల్లలు ఉపయోగిస్తారు. కోట్ల రూపాయల విలువ చేసే అమెరికా కప్ బోట్‌లను ఒమెగా విభాగంలో సెయిలర్లు వినియోగించనున్నారు.  

ఆనందంగా ఉంది   

‘1994 సంవత్సరంలో తొలిసారిగా హైదరాబాద్‌లోనే సెయిలింగ్ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రదర్శన కనబరిచా. మళ్లీ ఇప్పుడు తొలిసారి అమెరికా కప్ ఫార్మాట్ పోటీల్లో పాల్గొననుండటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది’ అని వరల్డ్ చాంపియన్ మహేష్ రాంచంద్రన్ చెప్పాడు.
 ‘నాలుగేళ్ల నుంచి హుస్సేన్ సాగర్‌లోనే సెరుులింగ్ ప్రాక్టీసు చేస్తున్నా. యాట్చ్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ శిక్షణ తీసుకున్నా. గతేడాది జరిగిన మాన్‌సూన్ రెగెట్టా పోటీల్లో కాంస్య పతకం సాధించా. ఈసారి కూడా ఉత్తమ ప్రదర్శన కనబరుస్తా’నని హైదరాబాద్ సెయిలర్ రాగి రజనీకాంత్ ధీమా వ్యక్తం చేశాడు.
   సిటీప్లస్
 
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు