'త్వరగా నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు'

14 Sep, 2016 11:21 IST|Sakshi

హైదరాబాద్ : గణేశ్ నిమజ్జోత్సవానికి కట్టుదిట్టమైన భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్లో సాక్షితో మాట్లాడుతూ.... పాతబస్తీలో ఐసిస్ కదలికల నేపథ్యంలో పటిష్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 12 వేల సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

జోన్ల వారీగా సీసీ కెమెరాల ద్వారా నిమజ్జన ఊరేగింపును పరిశీలిస్తామన్నారు. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ మహేందర్రెడ్డి హెచ్చరించారు. సోధ్యమైనంత త్వరగా నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు చేపట్టినట్లు మహేందర్రెడ్డి వివరించారు.
 

మరిన్ని వార్తలు