'తెలంగాణలో టీడీపీ చచ్చిపోయింది'

30 Dec, 2015 14:32 IST|Sakshi

హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీ చచ్చిపోయిందని టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల కోటలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ఆ విషయం వెల్లడైందని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బుధవారం హైదరాబాద్లో గట్టు రామచంద్రరావు స్పందించారు. ఈ సందర్భంగా గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోందని ఎద్దేవా చేశారు.

టీడీపీతో జట్టు కట్టడం వల్లే నల్గొండలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని గట్టు రామచంద్రరావు స్పష్టం చేశారు. డిసెంబర్ 27వ తేదీన స్థానిక సంస్థల కోటాలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ 10 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలను కైవసం చేసుకుంది.

మరిన్ని వార్తలు