ముస్లింలకు వైఎస్ చేసిన మేలు మరువలేనిది

7 Aug, 2016 01:21 IST|Sakshi
ముస్లింలకు వైఎస్ చేసిన మేలు మరువలేనిది

వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్: ముస్లిం మైనార్టీలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చేసిన మేలు మరువలేనిదని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ మైనార్టీ విభాగం విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్‌దేనని గట్టు కొనియాడారు. రంజాన్ మాసం ఇఫ్తార్ విందుల్లో పాల్గొన్నప్పుడు ముస్లిం లకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని, కానీ ఆ హామీ ఒక్క అంగుళం కూడా ముందుకు కదల దని విమర్శించారు.

వైఎస్సార్ ఏదైనా చేతల్లో చూపించేవారన్నారు.కానీ.. ఆయన తరువాత వచ్చిన సీఎంలు మాటలు తప్ప చేతలు లేవన్నారు. మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ మాట్లాడుతూ... వైఎస్సార్ సీఎంగా ఉన్న ఉమ్మడి ఏపీలో తప్ప కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రాల్లోనూ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అందించలేదన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ... ముస్లింలు అభివృద్ధి చెందాలంటే తెలంగాణలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలన్నా రు.

రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ మైనార్టీ విభాగం కమిటీలు 60 శాతం పూర్తయ్యాయని, మిగిలినవి త్వరలో పూర్తి చేస్తామని వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు మతీన్, ప్రధాన కార్యదర్శి మహ్మద్ రిజ్వాన్ హుస్సేన్ తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ మైనార్టీ విభాగం నాయకులు నౌఫిల్, న శ్రీన్, నజీర్, ఇబ్రహీం, జమీర్, జిల్లాల మైనార్టీ విభాగం అధ్యక్షులు అజీజ్ (హైదారాబాద్), సలీమ్ (కరీంనగర్), హైదర్ అలీ (మహబూబ్ నగర్), ఫయాజ్ (నల్గొండ), కరీం(రంగారెడ్డి జిల్లా) తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు