'కమీషన్లు తీసుకుంటూ ఖజానాపై భారం వేస్తుంది'

24 Jun, 2016 13:52 IST|Sakshi

హైదరాబాద్ : రాష్ట్రంలో పెంచిన విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గీతారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లో గీతారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఆర్టీసీ ఛార్జీలు పెంచమని ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ విస్మరించారని ఆరోపించారు. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపు ద్వారా పేదలు, మధ్య తరగతి ప్రజలుపై ఈ ప్రభుత్వం వందల కోట్ల భారం వేసిందని విమర్శించారు.

తగ్గించకపోతే ఇతర పార్టీలతో కలసి కాంగ్రెస్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తుందని ఆమె హెచ్చరించారు. మిషన్ భగీరథ, పాలమూరు - రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్ట్ల నిర్మాణ వ్యయాలను అంచనాలను ఇష్టానుసారంగా ప్రభుత్వం పెంచేస్తుందని చెప్పారు. కమీషన్లు తీసుకుంటూ ఖజానాపై భారం వేస్తుందని టీఆర్ఎస్పై గీతారెడ్డి మండిపడ్డారు.

మరిన్ని వార్తలు